ఆ సాక్సుల ధర రూ. 80 వేలు, ఆ షర్టు ధర రూ. 5 లక్షలు... హడలెత్తించే ధరలెందుకంటే...

ఒక జత సాక్స్ లేదా కొన్ని సాక్స్‌లను కొనుగోలు చేయడానికి మీరు ఎంత వెచ్చిస్తారు? 50, 100 లేదా 1000 రూపాయలు….మీ బడ్జెట్ ఇంతవరకూ మాత్రమే ఉంటే మీరు వికునా ఫాబ్రిక్‌తో తయారు చేసిన సాక్స్‌లను ఎప్పటికీ కొనుగోలు చేయలేరు.

 Most Expensive Fabric Vicuna Details, Most Expensive Fabric , Vicuna, World Most-TeluguStop.com

వీటి ఖరీదు మీ నెలవారీ జీతం కంటే ఎంతో ఎక్కువ.అవును, వికునా ఫ్యాబ్రిక్‌తో తయారు చేసిన సాక్స్ ధర రూ.80,000 వరకు ఉంటుంది.చొక్కా ధర చెబితే కాళ్లకింద నేల కదిలిపోయినట్లు అనిపిస్తుంది.5 నుంచి 5.5 లక్షల రూపాయలకు ఈ వస్త్రంతో తయారు చేసిన కండువాలు లభిస్తాయంటే మీరు అస్సలు నమ్మలేరు.ఇప్పటి వరకూ ధరలపై మాత్రమే చర్చించాం ఇక ఈ ఫాబ్రిక్ ప్రత్యేకతను తెలుసుకుంటే ఇక ఆశ్చర్యంలో మునిగితేలడమే మీ వంతు అవుతుంది.

ప్రపంచంలో అత్యంత ఖరీదైన ఫాబ్రిక్

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఫ్యాబ్రిక్ టైటిల్ వికునా పేరిట మీద ఉంది.ఇది అత్యంత ఖరీదైన ఫాబ్రిక్ కింద పరిగణించబడుతుంది.దానితో తయారు చేసిన దుస్తులను కొనడం సామాన్యులకు సాధ్యం కాదు.ఇటలీ కంపెనీ లోరో పియానా వెబ్‌సైట్‌లో వికుల ఫ్యాబ్రిక్‌తో తయారు చేసిన దుస్తుల విక్రయాన్ని పరిశీలిస్తే.ఒక జత సాక్స్ ధర రూ.80 వేలు కాగా, అదే షర్టును 4 నుంచి 5 లక్షల రూపాయలకు విక్రయిస్తున్నారు.

Telugu Camel Wool, Fabric, Italy, Luxuryvicuna, Vicuna, Vicuna Fabric, Expensiv

వికునా ఫాబ్రిక్ ఎందుకు అంత ఖరీదైనది?

వికునా ఫాబ్రిక్ ప్రత్యేకంగా ఒంటె వెంట్రుకలతో తయారు చేయబడుతుంది.ఈ తరహా చిన్న సైజు ఒంటెలు దక్షిణ అమెరికాలోని ప్రత్యేక ప్రాంతాల్లో కనిపిస్తాయి.ఈ జాతి ఒంటెలు ఇప్పుడు అంతరించిపోతున్నాయి.

వాటిని 1960 సంవత్సరంలోనే అత్యంత అరుదైన జాతిగా ప్రకటించారు.ఈ ఒంటెల పెంపకం, సంరక్షణ నియమాలు చాలా కఠినంగా ఉంటాయి.

వికునా ఒంటెల నుండి తయారయ్యే ఉన్ని చాలా చక్కగా, తేలికగా, ఎంతో వెచ్చగా ఉంటుంది.

Telugu Camel Wool, Fabric, Italy, Luxuryvicuna, Vicuna, Vicuna Fabric, Expensiv

వికునా ఉన్ని మందం 12 నుండి 14 మైక్రాన్లు ఉంటుంది.ఈ దుస్తులు చాలా వేడిగా ఉంటాయి.అందువల్ల వాటి ధర కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది.

వికునా ఉన్నితో కోటు తయారు చేయడానికి, దాదాపు 35 ఒంటెల నుండి ఉన్నిని సేకరించాలి.దీని ప్రకారం మీరు దాని విలువను అంచనా వేయవచ్చు.

ఇటలీకి చెందిన లోరో పియానా కంపెనీ వికునా కోసం ప్రత్యేక అభయారణ్యం ఏర్పాటు చేసింది.పెరూ సమీపంలో 5,000 ఎకరాలలో వికునా ఒంటెలను పెంచుతారు.

వాటిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ వాటి నుంచి ఉన్నిని సేకరిస్తారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube