Most Eligible Bachelors: నాలుగు పదుల వయసు దాటిన సౌత్ ఇండస్ట్రీలో పెళ్లికాని ప్రసాదులు వీళ్లే?

సాధారణంగా ప్రతి ఒక్కరి జీవితంలోను పెళ్లి అనేది ఎంతో కీలకమైన విషయమనే చెప్పాలి.అందుకే ఒక వయసు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా పెళ్లిళ్లు చేసుకోవడానికి ఆసక్తి చూపుతుంటారు.

 Most Eligible Bachelors In Movie Industry List Prabhas Shimbu Vishal-TeluguStop.com

అయితే సినీ సెలెబ్రెటీల నుంచి మొదలుకొని ప్రతి ఒక్కరు కూడా పెళ్లిళ్లు చేసుకొని కొత్త జీవితంలో సంతోషంగా ఉన్నారు.కానీ సినిమా సెలబ్రిటీలలో కొంతమంది మాత్రం నాలుగు పదుల వయసు దాటిపోతున్న కూడా ఇంకా పెళ్లి కాని ప్రసాదులుగానే మిగిలిపోయారు.ఇలా మన సౌత్ ఇండస్ట్రీలో నాలుగు పదుల వయసు వచ్చినప్పటికీ పెళ్లి చేసుకొని సెలబ్రిటీలు చాలామంది ఉన్నారని చెప్పాలి మరి ఆ పెళ్లి కాని ప్రసాదులు ఎవరో ఓ లుకేసేద్దాం.

ప్రభాస్:

టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఎవరు అంటే టక్కున ప్రభాస్ (Prabhas) పేరు చెప్పేస్తారు.ఈయన గత కొద్దిరోజుల క్రితం 44వ పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నారు .ఇప్పటివరకు ప్రభాస్ బ్యాచిలర్( Bachelor ) గానే ఉంటున్నారు తప్ప పెళ్లి చేసుకోవాలని ఏమాత్రం ఆలోచన చేయలేదు.అయితే వచ్చే ఏడాది దసరా కల్లా తనకు పెళ్లి జరుగుతుంది అంటూ తన పెద్దమ్మ శ్యామలాదేవి తెలిపారు.మరి అప్పటికైనా ప్రభాస్ పెళ్లి చేసుకుంటారా లేక ఇలాగే బ్యాచిలర్ గానే ఉంటారా అనేది తెలియాల్సి ఉంది.

Telugu Bachelor Actors, Prabhas, Rakshith Shetty, Shimbu, Subbaraju, Vishal-Late

విశాల్:

టాలీవుడ్ ఇండస్ట్రీతో పాటు కోలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి విశాల్ (Vishal) ఇప్పటికీ 46 సంవత్సరాల వయసు కలిగి ఉన్నారు.అయితే ఈయన కూడా ఇప్పటివరకు పెళ్లి చేసుకోకుండా సింగిల్గానే ఉన్నారు.అయితే ఈయన గతంలో వరలక్ష్మి శరత్ కుమార్ ను ప్రేమించారంటూ వార్తలు వచ్చే అలాగే మరొక నటితో కలిసి ఈయన నిశ్చితార్థం కూడా చేసుకున్నారు.ఇలా నిశ్చితార్థం జరిగిన పెళ్లి వరకు ఈ జంట వెళ్లలేదని తెలుస్తుంది.

ఈ విధంగా పలు బ్రేకప్ జరిగిన విశాల్ అలాగే సింగిల్గానే ఉండిపోయారు.

Telugu Bachelor Actors, Prabhas, Rakshith Shetty, Shimbu, Subbaraju, Vishal-Late

శింబు:

కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపు పొందినటువంటి శింబు (Shimbu )ఇప్పటికే సింగిల్గానే ఉన్నారు ఈయన కూడా నాలుగు పదుల వయసులోకి అడుగుపెట్టారు.అయితే ఈయన గతంలో నయనతార హన్సిక వంటి హీరోయిన్లతో ప్రేమాయణం నడిపారు.పెళ్లి కూడా చేసుకుంటారు అంటూ అప్పట్లో వార్తలు వచ్చినప్పటికీ కొన్ని కారణాల వల్ల బ్రేకప్ చెప్పుకున్నారు.

దీంతో ఇప్పటికి సింగిల్గానే ఉంటూ బ్యాచిలర్ జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నారు.

Telugu Bachelor Actors, Prabhas, Rakshith Shetty, Shimbu, Subbaraju, Vishal-Late

రక్షిత్ శెట్టి:

కన్నడ చిత్రపరిశ్రమలో స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి రక్షిత్ శెట్టి (Rakshith Shetty) రష్మికతో ప్రేమలో పడ్డారు.ఇలా రష్మికతో ప్రేమలో ఉన్నటువంటి రక్షిత్ శెట్టి పెద్దల సమక్షంలో ఎంతో ఘనంగా నిశ్చితార్థం కూడా చేసుకున్నారు.అయితే కొన్ని కారణాల వల్ల వీరి నిశ్చితార్థం బ్రేకప్ చెప్పుకున్నారు అప్పటినుంచి ఈయన పెళ్లి గురించి ఆలోచించకుండా కెరియర్ పై ఫోకస్ పెట్టారు.

అయితే ఈయన కూడా నాలుగు పదుల వయసులోకి అడుగుపెట్టారు అయినప్పటికీ ఇంకా పెళ్లి గురించి ఆలోచించకుండా సింగిల్గానే ఉన్నారు.

Telugu Bachelor Actors, Prabhas, Rakshith Shetty, Shimbu, Subbaraju, Vishal-Late

సుబ్బరాజు:

ఎన్నో తెలుగు సినిమాలలో విలన్ పాత్రలలో కమెడియన్ గాను నటిస్తూ మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో సుబ్బరాజు( Subbaraju ) ఒకరు ఇలా ఈయన సుమారు 60 సినిమాలలో నటుడిగా నటించి మెప్పించారు.ఇలా సినిమాలు పరంగా ప్రేక్షకులను పెద్ద ఎత్తున సందడి చేస్తున్నటువంటి సుబ్బరాజు ఇప్పటికీ పెళ్లి చేసుకోలేదు.ప్రస్తుతం ఈయన వయసు 46 సంవత్సరాలు అయినప్పటికీ ఈయన మాత్రం పెళ్లి గురించి ఆలోచన చేయలేదు.

పెద్దలు చెప్పినప్పుడు కాకుండా తనకు ఇష్టం వచ్చినప్పుడు చేసుకోవాలి అనిపించినపుడు పెళ్లి చేసుకుంటానని ఇంకా బ్యాచిలర్ జీవితాన్ని గడుపుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube