మొన్న టీటీడీ చైర్మన్,నేడు ఎఫ్ డీసీ చైర్మన్

ఈ సారి జరిగిన ఎన్నికల్లో వైసీపీ పార్టీ విజయం సాధించడం తో ఏపీ లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.అయితే తొలుత ప్రభుత్వం ఏర్పడిన తరువాత టీటీడీ చైర్మన్ గా ప్రముఖ నటుడు మోహన్ బాబు ని నియమించనున్నట్లు వార్తలు వచ్చాయి అయితే ఆ వార్తలను మోహన్ బాబు ఖండించారు.

 Mohan Babu Refusefdc Chairman Post 1-TeluguStop.com

నేను జగన్ కు,ఆయన పార్టీ గెలుపు కోసం నా వంతు ప్రయత్నం చేశాను తప్ప ఎలాంటి పదవులను ఆశించడం లేదని సోషల్ మీడియా ద్వారా తెలిపారు.అయితే అనంతరం టీటీడీ చైర్మన్ గా వైవీ సుబ్బారెడ్డి ని నియమించారు కూడా.

అయితే ఇప్పుడు తాజగా ఎఫ్ డీసీ చైర్మన్ గా మోహన్ బాబు ను నియమించనున్నట్లు వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.అయితే ఈ వార్తలను తాజాగా మరోసారి మోహన్ బాబు పీఆర్ టీమ్ వెల్లడించింది.

-Telugu Political News

ఏపీ ఫీలిండెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా మోహన్ బాబు గారిని నియమిస్తున్నట్లు వచ్చిన వార్తల్లో నిజం లేదని, అలాంటిది ఏదైనా ఉంటె అధికారికంగా వెల్లడిస్తామని పీఆర్ టీమ్ వెల్లడించింది.ఇలాంటి వార్తలను నమ్మకండి అంటూ వారు పేర్కొన్నారు.కాగా నామినేటెడ్ పదవులకు ఏపీ సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ఈ క్రమంలో ఎఫ్ డీసీ చైర్మన్ గా మోహన్ బాబు ని నియమించనున్నట్లు వార్తలు రావడం తో తాజాగా ఆ వార్తలను కూడా ఖండించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube