మహమ్మద్ రఫీ పాట పాడి ఆకట్టుకున్న పెద్దాయన.. వీడియో చూస్తే ఫిదా!

సోషల్ మీడియాలో టాలెంటెడ్ పీపుల్‌కి కొదవ లేదు.సోషల్ మీడియా వేదికగా చాలా మంది తమ టాలెంట్‌ను ఇప్పటికే బయటపెట్టారు.

 Mohammed Rafi's Singing Song Impresses The Old Man. Viral News, Viral Video, Old-TeluguStop.com

చిన్న వయసు ఉన్న పిల్లలనుంచి పెద్దవారి వరకు ఎందరో తమ అరుదైన ప్రతిభను బయటపెట్టారు.కాగా తాజాగా ఒక పెద్దాయన మహమ్మద్ రఫీ పాట పాడి అందర్నీ ఆకట్టుకుంటున్నాడు.

85 ఏళ్ల వృద్ధుడు బాలీవుడ్ క్లాసిక్ పాటను పాడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఈ వృద్ధుడి పేరు డా.సురేష్ నంబియార్.ఇతను కేరళలోని కన్నూర్‌లోని తన ఇంట్లో “పుకర్తా చలా హూన్ మైన్” పాట పాడాడు.

దానికి సంబంధించిన వీడియోని తన కూతురు రికార్డ్ చేసింది.ఈ పాట “మేరే సనం (1985)” అనే సినిమాలోనిది.

అయితే ఆ వీడియో కొన్ని న్యూస్ వెబ్‌సైట్‌లో పేర్కొన్నట్లు చెప్పినట్లుగా తమిళనాడులోని వృద్ధాశ్రమంలోనిది కాదని, తన తండ్రి ఇంట్లోని వీడియో అని ఆయన కుమార్తె సుమ వెల్లడించింది.ఈ పాట తనకు ఇష్టమైన వాటిలో ఒకటి అని కూడా ఆమె పేర్కొంది.

ఈ వీడియో 1,300 కంటే ఎక్కువ వ్యూస్, 87 లైక్‌లను పొందింది.చాలా మంది ట్విట్టర్ యూజర్లు పెద్దాయన అద్భుతమైన గానాన్ని, అద్భుతమైన స్వరాన్ని ప్రశంసించారు.వయసు పైబడినా క్లారిటీతో పాటలు పాడుతూ ఇంకా యవ్వనంగానే ఉన్నాడని కామెంట్స్ చేస్తున్నారు.ఈ ముసలయన చాలా గ్రేట్ అని మరికొందరు కామెంట్ చేస్తున్నారు.మనసుని కదిలించే ఈ వీడియోని చూస్తే ఈరోజు మీ ముఖంలో చిరునవ్వును తీసుకురావడం ఖాయం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube