హన్మకొండ డీసీసీ ప్రెసిడెంట్ నాయిని చేసిన సవాల్ కు బీఆర్ఎస్ ఎమ్మెల్యే వినయభాస్కర్ కౌంటర్ ఇచ్చారు.తన స్థాయి లేని నేతల వ్యాఖ్యలకు సమాధానం ఇచ్చేదిలేదన్నారు.
ఎన్నికల సమయంలో అభివృద్ధికే పట్టం కడతారని స్పష్టం చేశారు.అన్ని పార్టీల్లోని కార్యకర్తలు తనకు ఓటు వేస్తారని వినయభాస్కర్ ఆశాభావం వ్యక్తం చేశారు.
హన్మకొండ జిల్లాలో కాంగ్రెస్ అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి పేరుతో వెలసిన పోస్టర్లు కలకలం సృష్టించిన విషయం తెలిసిందే.500 ఇందిరమ్మ ఇళ్లు కాజేసింది ఎవరు రాజేంద్ర అంటూ పోస్టర్లు దర్శనమిస్తున్నాయి.ఈ నేపథ్యంలో వాల్ పోస్టర్లపై స్పందించిన డీసీసీ ప్రెసిడెంట్ నాయిని రాజేందర్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యే అనుచరులు పోస్టర్లు వేశారని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.పరువు నష్టం దావా వేస్తానన్న ఆయన దమ్ముంటే మీ పేరుతో పోస్టర్లు వేయండి.
తేల్చుకుందామన్నారు.వరంగల్ వెస్ట్ నుంచి బరిలోకి దిగుతా.
చూసుకుందామంటూ ఎమ్మెల్యే వినయభాస్కర్ కు నాయిని రాజేందర్ రెడ్డి సవాల్ చేసిన సంగతి తెలిసిందే.