గత కొన్ని రోజులుగా గుడివాడ వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని( Kodali Nani ) మీడియాకి చాలా దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే.దీంతో ఆయన అనారోగ్యానికి గురైనట్లు రకరకాల వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ వస్తున్నాయి.
ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా తన ఆరోగ్యం పై వస్తున్న వార్తలకు కొడాలి నాని స్పందించారు.చంద్రబాబుని( Chandrababu ) రాజకీయ సమాధి చేసే వరకు తాను బతికే ఉంటానని కామెంట్ చేశారు.
ఇదే సమయంలో తాను బేషుగ్గా ఉన్నట్లు తన ఆరోగ్యం పై అనవసరంగా టీడీపీ సోషల్ మీడియా తప్పుడు ప్రచారం చేస్తుందని ఖండించారు.
టీడీపీ దిగజారి తన ఆరోగ్యం పై తప్పుడు ప్రచారం చేయిస్తుందని విమర్శించారు.2024 ఎన్నికల తర్వాత చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరూ మెంటల్ ఆస్పత్రికి వెళ్తారని కొడాలి నాని వ్యాఖ్యానించారు.దమ్ముంటే గుడివాడ నియోజకవర్గంలో తనపై పోటీ చేయాలంటూ చంద్రబాబుకి అదేవిధంగా నారా లోకేష్ కి( Nara Lokesh ) సవాల్ విసిరారు.
ఇటువంటి వార్తలు తన చిన్నప్పుడు నుండి వస్తూనే ఉన్నాయి.అయినా ఈ వార్తలకు నా వెంట్రుక కూడా రాలేదు.తెలుగుదేశం పార్టీ బాగా దిగజారిపోయింది.టీడీపీ సోషల్ మీడియా సంస్థ ద్వారా ఇటువంటి వార్తలు ప్రచారం చేసి టీడీపీ నేతలు శునకానందం పొందుతున్నారు అంటూ కొడాలి నాని మండిపడ్డారు.