చెరుకు పంటకు( Sugarcane Crop ) ఏడాది పొడవునా మార్కెట్లో మంచి డిమాండ్ ఉంటుంది.చెరుకు ద్వారా పంచదార, బెల్లం, మొలాసిన్ ఫిల్టర్ మడ్డి ఉత్పత్తి అవుతాయి.
చెరుకు పంట పై పూర్తి అవగాహన ఉంటే అధిక దిగుబడి సాధించి మంచి లాభాలు పొందవచ్చు.వేసవి కాలంలో పొలాన్ని లోతు దుక్కులు దున్నుకోవాలి.
పంట అవశేషాలు ఏమైనా ఉంటే పూర్తిగా తొలగించాలి.నీటి సదుపాయం( Water Facility ) ఉండే నల్ల రేగడి నేలలు, ఇసుక నేలలు, గరప నేలలు చాలా అనుకూలంగా ఉంటాయి.
చెరకు గడలను( Sugarcane ) వేడి నీటిలో (52 సెల్సియస్ వద్ద 30 నిముషాలు) లేదా తేమతో కూడిన మిళితమైన వేడిగాలి (54 సెల్సియస్ వద్ద 4 గంటలు) లో విత్తన శుద్ధి చేసుకోవాలి.ఇలా విత్తన శుద్ధి చేసుకుంటే కాటుక, గడ్డిదుబ్బ, ఆకుమాడు తెగులను అరికట్టవచ్చు.

పంట వేయడానికి ఐదు వారాల ముందు ఒక ఎకరాకు పది టన్నుల పశువుల ఎరువు వేసి కలియదున్నాలి.ఆ తరువాత నేలను చదును చేసి కాలువలను, బోదెలను రెక్కల నాగలితో ఏర్పాటు చేసుకోవాలి.కాలువ వెడల్పు 30 సెంటీమీటర్లు, కాలువ లోతు 20 సెంటీమీటర్లు ఉంటే నీరు సమృద్ధిగా చెరకు మొక్కలకు అందుతుంది.మొక్కల మధ్య 60 సెంటీమీటర్ల దూరం, మధ్య 80 సెంటీమీటర్ల దూరం ఉండేటట్లు నాటుకుంటే పంట దిగుబడి ఆశించిన స్థాయిలో ఉంటుంది.
అంటావేశాక మొదటి నాలుగు నెలల వారానికి ఒకసారి నీటిని అందించాలి.తక్కువ దశలో ఉన్నప్పుడు మూడు వారాలకు ఒకసారి నీటిని అందించాలి.

చెరకు పంటను ఆశించే గడ్డిదుబ్బు తెగులను సకాలంలో గుర్తించి సంరక్షించుకుంటే అధిక దిగుబడి పొందవచ్చు.ఈ తెగులు ఆశించిన తర్వాత మొక్కల మొదల నుండి సన్నని కురుచుగా నున్న తెల్లని పిలకలు ఎక్కువగా కనిపిస్తాయి.క్రమంగా ఆకులు పాలిపోయి చాలా చిన్నవిగా ఉండి ఎదుగుదల సరిగా ఉండదు.ఈ మొక్కలను పీకి ఒక గుంతలో వేసి తగులబెట్టాలి.పొలంలో కలుపు లేకుండా ఎప్పటికప్పుడు పీకేయాలి.డైమిధోయెట్ 2మి.
లీ ను లీటర్ నీటిలో కలిపి పిచికారి చేయాలి.లేదంటే మలాధియాన్ 2మి.లీ ను పీటర్ నీటిలో కలిపి పిచికారి చేసి ఈ తెగులను అరికట్టాలి.







