సరికొత్త ఫీచర్లు తీసుకొచ్చిన మైక్రోసాఫ్ట్ ఎడ్జ్

మైక్రోసాఫ్ట్ సరికొత్త ఫీచర్లతో ఎడ్జ్ ను తన కస్టమర్లకు అందించింది.చాట్‌జిపిటి కంటే శక్తివంతమైన కొత్త ఓపెన్‌ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్ ఆధారంగా సరికొత్త AI-ఆధారిత బింగ్ సెర్చ్ ఇంజన్, ఎడ్జ్ వెబ్ బ్రౌజర్‌ను తీసుకొచ్చింది.

 Microsoft Edge Brings New Features, Microsoft Edge, Ai Powered Bing Search Engin-TeluguStop.com

బింగ్.కామ్‌ ఇప్పుడు ప్రివ్యూలో అందుబాటులో ఉంది.

కొత్త టెక్నాలజీ మెరుగైన సెర్చింగ్, మరింత పూర్తి సమాధానాలు, కొత్త చాట్ అనుభవం, కంటెంట్‌ను రూపొందించగల సామర్థ్యాన్ని అందిస్తుంది.ఈ విషయాన్ని మైక్రోసాఫ్ట్ ఛైర్మన్, CEO సత్య నాదెళ్ల ప్రకటించారు.

చాట్, కంపోజ్ విషయంలో ఈ ఫీచర్లు చాలా ఉపయోగ పడతాయి.

Telugu Microsoft, Microsoft Edge, Ups-Latest News - Telugu

కొత్త Bing మీకు సుపరిచితమైన సెర్చింగ్ అనుభవాన్ని అందిస్తుంది.స్పోర్ట్స్ స్కోర్‌లు, స్టాక్ ధరలు, వాతావరణం వంటి సాధారణ విషయాల కోసం మరింత సంబంధిత ఫలితాలను అందిస్తుంది.మీకు కావాలంటే మరింత సమగ్రమైన సమాధానాలను కొత్త సైడ్‌బార్‌తో పాటు చూపిస్తుంది.

మీరు వెతుకుతున్న సమాధానాన్ని కనుగొనడానికి, తెలుసుకోవడానికి వెబ్ అంతటా Bing ఫలితాలను సమీక్షిస్తుంది.సంక్లిష్టమైన శోధనల కోసం ఇది ఉపయోగపడుతుంది.

Telugu Microsoft, Microsoft Edge, Ups-Latest News - Telugu

ఏదైనా టీవీని కొనుగోలు చేయాలనుకుంటే Bing కొత్త, ఇంటరాక్టివ్ చాట్‌ను అందిస్తుంది.మరిన్ని వివరాలు, స్పష్టత కోసం అడగడం ద్వారా మీరు వెతుకుతున్న పూర్తి సమాధానాన్ని పొందే వరకు మీ సెర్చింగ్ మెరుగుపరచడానికి చాట్ అనుభవం మీకు ఉపయోగపడుతుంది.కొత్త Bing మీకు సహాయం చేయడానికి కంటెంట్‌ను రూపొందించగలదు.ఇది మీకు ఇమెయిల్‌ను వ్రాయడంలో, సెలవుల కోసం 5-రోజుల ప్రయాణ ప్రణాళికను రూపొందించడంలో సహాయపడుతుంది.మీ ప్రయాణం మరియు వసతిని బుక్ చేసుకోవడానికి లింక్‌లు, ఉద్యోగ ఇంటర్వ్యూ కోసం ప్రిపరేషన్‌కు సహాయపడుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube