ఈ మధ్య కాలంలో కొందరు వివాహేతర సంబంధాల మోజులో పడి చివరికి వయసుతో సంబంధం లేకుండా ప్రవర్తిస్తున్నారు.కాగా తాజాగా 40 ఏళ్ళు కలిగినటువంటి వివాహిత 25 సంవత్సరాలు ఉన్న యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకొని చివరికి ప్రాణాలు విడిచిన ఘటన మధ్య ప్రదేశ్ రాష్ట్రంలో వెలుగు చూసింది.
పూర్తి వివరాల్లోకి వెళితే స్థానిక రాష్ట్రంలోని గాత్ర గ్రామ పరిసర ప్రాంతంలో రామ్ రాజ్ అనే ఓ ఓ యువకుడు తన కుటుంబ సభ్యులతో కలిసి నివాసముంటున్నాడు.అయితే ఇటీవలే ఈ యువకుడి చదువులు పూర్తవడంతో లాక్ డౌన్ కారణంగా ఇంటి పట్టునే ఉంటున్నారు.
ఈ క్రమంలో ఇదే గ్రామంలో నివాసముంటున్న శాంతిఅనే మహిళతో పరిచయం ఏర్పడింది.కాగా గత కొద్ది కాలంగా శాంతి తన భర్తతో విభేదాలు రావడంతో పుట్టింటిలోనే ఉంటోంది.
దీంతో రామ్ రాజ్ తో పరిచయం కాస్త ప్రేమగా మారింది.ఈ క్రమంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో శాంతి తన ప్రియుడిని పిలిపించుకొని ఎంజాయ్ చేసేది.
ఈ క్రమంలో రామ్ రాజ్ వివాహేతర సంబంధం గురించి శాంతి ఇంట్లో వాళ్లకి తెలిసిపోయింది.దీంతో తనను పెళ్లి చేసుకోవాలని శాంతి తన ప్రియుడిపై ఒత్తిడి తెచ్చింది.కానీ రామ్ రాజ్ కి మాత్రం శాంతి ని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు.దీంతో ఆమెని హతమార్చాలని పన్నాగం పన్నాడు.ఈ క్రమంలో మాట్లాడాలని శాంతి ని పిలిపించి ఇద్దరూ బాగానే ఎంజాయ్ చేసిన అనంతరం రామ్ రాజ్ తన వెంట తెచ్చుకున్న కత్తితో శాంతిని బలంగా గాయపరిచాడు.దీంతో శాంతి అక్కడికక్కడే మృతి చెందింది.
అనంతరం శాంతి మృత దేహాన్ని రామ్ రాజ్ తన ఇంట్లోని వంట గదిలో పూడ్చి పెట్టాడు.కాగా కొద్ది రోజుల తర్వాత శాంతి కుటుంబ సభ్యులు ఈ విషయం గురించి పోలీసులకు సమాచారం అందించడంతో రామ్ రాజ్ ని అదుపులోకి తీసుకొని విచారించగా తనని పెళ్లి చేసుకోమని ఒత్తిడి తెచ్చేందుకే తన ప్రియురాలిని దారుణంగా హతమార్చినట్లు నేరం అంగీకరించాడు.