ప్రస్తుత కాలంలో కొందరు తమ లైంగిక వాంఛలను తీర్చుకునేందుకు పసి పిల్లల జీవితాలను చిదిమేస్తున్నారు.తాజాగా ఓ వ్యక్తి పదేళ్ల తన మేనకోడలు పై గత కొద్ది రోజులుగా దారుణంగా అత్యాచారం చేస్తూ ఆమెను గర్భవతిని చేసిన ఘటన హైదరాబాద్ నగరంలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే తూర్పు గోదావరి జిల్లాకు చెందిన టువంటి ఓ వ్యక్తి బతుకుదెరువు నిమిత్తమై తన కుటుంబంతో కలిసి హైదరాబాద్ నగరానికి వచ్చాడు.అయితే ఇందులో భాగంగా నగరంలోని నిజాంపేట ప్రాంతంలో ఉన్నటువంటి ఓ అపార్ట్మెంట్లో వాచ్ మెన్ గా పని చేస్తున్నాడు.
అయితే ఈ వ్యక్తి బావ కూడా ఇదే ప్రాంతంలో ఉన్నటువంటి మరో అపార్ట్మెంట్లో వాచ్ మెన్ గా పనిచేస్తూ తన కుటుంబంతో నివాసం ఉంటున్నాడు.అయితే ఈ క్రమంలో తన బావ కూతురు అయినటువంటి 13 ఏళ్ల బాలిక తరుచు తన మేనమామ ఇంటికి వస్తూ వెళుతూ ఉండేది.
ఈ క్రమంలో ఆ బాలిక పై కన్నేశాడు తన మేనమామ.అంతేగాక ఎవరూ లేని సమయంలో బాలికపై గత కొద్ది రోజులుగా అత్యాచారం చేస్తున్నాడు.దీంతో బాలిక గర్భం దాల్చింది.
ఈ విషయం తెలుసుకున్న టువంటి బాలిక తల్లిదండ్రులు తాను గర్భం దాల్చడానికి కారణం ఎవరని నిలదీయగా బాలిక తన పై జరిగిన అఘాయిత్యం గురించి చెప్పింది.విషయం తెలుసుకున్న టువంటి బాలిక తండ్రి దగ్గరలో ఉన్నటువంటి పోలీసులను సంప్రదించి బాలికపై జరిగినటువంటి అఘాయిత్యం గురించి ఫిర్యాదు నమోదు చేశారు.ఫిర్యాదు నమోదు చేసుకున్న టువంటి పోలీసులు నిందితుడు బాలిక మేనమామను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.