ఆ పాత్రకి ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యానంటున్న రాశి ఖన్నా... 

ప్రతీ రోజు పండుగే ఈ చిత్రంలో టిక్ టాక్ స్టార్ గా ప్రేక్షకులను ఎంతగానో అలరించిన టువంటి రాశి కన్నా తాజాగా “వరల్డ్ ఫేమస్ లవర్” అనే చిత్రంలో నటించింది.ఈ చిత్రంలో హీరోగా టాలీవుడ్ రౌడీ విజయ్ దేవరకొండ నటించాడు.

 Rashi Khanna Latest Movie News-TeluguStop.com

అయితే ఈ చిత్రానికి దర్శకుడు క్రాంతి మాధవ్ దర్శకత్వం వహించగా నిర్మాత కె.ఎస్.రామారావు నిర్మించారు.అలాగే ఈ చిత్రంలో కేతరిన్, ఇసాబెల్లా, ఐశ్వర్య రాజేష్ వంటి వారు ప్రధాన తారాగణంగా నటించారు.

అయితే ఈ చిత్రం ప్రమోషన్ లో భాగంగా హీరోయిన్ రాశి కన్నా ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూ లో పాల్గొన్నారు.ఇందులో భాగంగా ఈ చిత్ర విశేషాలను తన అభిమానులతో పంచుకున్నారు.

ఈ చిత్రంలోని తను నటించినటువంటి యామిని పాత్రకి బాగా కనెక్ట్ అయ్యానని అంతేగాక ఆ పాత్రలో నటిస్తున్న సన్నివేశాల్లో ఒక్కోసారి ఎమోషనల్ అయ్యే ఏడ్చేసేదాన్ని అంటోంది ఈ అమ్మడు.అంతేగాక ఈ చిత్రం లవ్ అండ్ ఎమోషనల్ థ్రిల్లర్ గా ఉంటుందని కచ్చితంగా ప్రేక్షకులకు నచ్చుతుందని ప్రతి ఒక్కరూ థియేటర్ కి వెళ్లి చూడాలని కోరారు.

Telugu Rashikhanna, Rashi Khanna, Tollywood, Lover-Movie

అయితే వాలెంటెన్స్ డే కానుకగా వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రం ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.అయితే నలుగురు హీరోయిన్లు ఉన్నటువంటి ఈ చిత్రం ప్రేక్షకులని బాగానే ఆకట్టుకుంటోంది.అంతేకాక యూఎస్ లో మంచి ఓపెనింగ్స్ కూడా రాబట్టినట్లు తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube