గొప్పింటి కోడలు కాబోతున్న మెహ్రీన్.. వరుడు ఎవరంటే..?

కృష్ణగాడి వీర ప్రేమగాథ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు మెహ్రీన్.తొలి సినిమాతోనే నటిగా మంచి పేరును సంపాదించుకున్న మెహ్రీన్ ఆ తర్వాత రాజా ది గ్రేట్, ఎఫ్ 2 లాంటి హిట్ సినిమాల్లో నటించారు.

 Mehreen Kaur Pirzada Marry Ex Cm Grand Son, Bhavya Bhishnov , F2 Heroine, Marria-TeluguStop.com

ఎఫ్ 2 సినిమా సీక్వెల్ ఎఫ్ 3 సినిమాలో కూడా మెహ్రీన్ నటిస్తున్నారు.అయితే త్వరలోనే మెహ్రీన్ పెళ్లి చేసుకోబోతున్నారని గొప్పింటి కోడలు కాబోతున్నారని తెలుస్తోంది.

మాజీ ముఖ్యమంత్రి మనవడిని మెహ్రీన్ పెళ్లి చేసుకోబోతుందని తెలుస్తోంది.మూడుసార్లు హర్యానా రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పని చేసిన హర్యానా సీఎం భజన్ లాల్ బిష్ణోయ్ మనవడు భవ్య బిష్ణోయ్ తో వివాహం నిశ్చయమైందని తెలుస్తోంది.

వచ్చే నెల 13వ తేదీన మెహ్రీన్ నిశ్చితార్థం జరగనుందని తెలుస్తోంది.మెహ్రీన్, భవ్య బిష్ణోయ్ కలిసి తిరుగుతున్న ఫోటోలు ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

Telugu Bhavya Bhishnov, Haryanacm, Mehreen Kaur-Movie

మెహ్రీన్ నిశ్చితార్థ వేడుక రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్ పూర్ ప్యాలెస్ లో జరగనుందని.పరిమిత సంఖ్యలో బంధుమిత్రులు ఈ వివాహ వేడుకకు హాజరు కానున్నారని తెలుస్తోంది.ఈ వివాహం పెద్దలు కుదిర్చిన వివాహం అని సమాచారం.గతేడాది చాలామంది టాలీవుడ్ సెలబ్రిటీల వివాహాలు జరగగా ఈ ఏడాది కూడా సెలబ్రిటీల వివాహాలకు సంబంధించిన వార్తలు వస్తున్నాయి.25 సంవత్సరాల వయస్సులోనే మెహ్రీన్ పెళ్లి చేసుకోబోతూ ఉండటం గమనార్హం.

మెహ్రీన్ తెలుగు, తమిళ భాషల్లో ఇప్పటివరకు మొత్తం 26 సినిమాలలో నటించారు.

పెళ్లికొడుకు తండ్రి కుల్‌దీప్ బిష్ణోయ్‌ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఆడంపూర్ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నారు.పెళ్లి ఫిక్స్ కావడంతో మెహ్రీన్ కు అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.పెళ్లి తరువాత మెహ్రీన్ నటిగా సినిమాల్లో కొనసాగుతారో లేదో తెలియాల్సి ఉంది.ఈ మధ్య కాలంలో హనీ ఈజ్ ద బెస్ట్ అంటూ మెహ్రీన్ ఎఫ్ 2 సినిమాలో చేసిన పాత్ర ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube