Chiranjeevi , Vasishta : బాహుబలి, కేజీఎఫ్ బాటలో చిరంజీవి వశిష్ట కాంబో మూవీ.. ఏం జరిగిందంటే?

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి( chiranjeevi ) ఇటీవలె భోళా శంకర్ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ఊహించని విధంగా డిజాస్టర్ గా నిలిచింది.

 Mega 156 Movie Plans In 2 Parts-TeluguStop.com

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం చిరంజీవి తదుపరి సినిమాలో విషయంలో బిజీ బిజీగా ఉన్నారు.తాజాగా చిరు తదుపరి సినిమాకు సంబంధించి ఒక ఆసక్తికర వార్త వైరల్ అవుతోంది.

అదేమిటంటే చిరంజీవి కెరీర్లోనే మొదటిసారి ఒక సినిమా రెండు భాగాలుగా రాబోతోందా అంటే ఏమో నిజమే కావచ్చు అంటున్నాయి మెగా కాంపౌండ్ వర్గాలు.వశిష్ఠ( Mallidi Vasishta ) దర్శకత్వంలో పాట రికార్డింగ్ తో ఇటీవలే మొదలుపెట్టిన మెగా 156కి ఈ ప్రతిపాదన సీరియస్ గా ఉందట.

Telugu Chiranjeevi, Italy, Socaial, Tollywood, Varun Tej-Movie

యువి క్రియేషన్స్ దీని పై సుమారు 200 కోట్ల బడ్జెట్ సిద్ధం చేసిందనే వార్త ఇప్పటికీ హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే.అయితే సైరా నరసింహారెడ్డికి అంత ఖర్చు కాకపోయినా నష్టాలు చవిచూడాల్సి వచ్చింది.అందుకే బిజినెస్ పరంగా టూ పార్ట్స్ అయితేనే సేఫ్ అంటున్నారట.ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు కానీ ప్రస్తుతం ఇది చర్చల దశలో ఉంది.అయితే ప్రస్తుతం మెగాస్టార్ తో పాటు మెగా ఫ్యామిలీ మొత్తం వరుణ్ తేజ్ పెళ్లి సందడిలో ఉంది.

Telugu Chiranjeevi, Italy, Socaial, Tollywood, Varun Tej-Movie


నవంబర్ 1వ తేదీ ఇటలీ( Italy )లో జరిగే వేడుకతో మొదలుపెట్టి హైదరాబాద్ లో నిర్వహించబోయే రిసెప్షన్ పూర్తయ్యే దాకా వాళ్ళెవరూ సినిమా పనులు చూసుకోరు.అందుకే వశిష్ట చిరు ఫ్రీ అయ్యేలోపు ప్రతిపాదన సిద్ధం చేసి హీరో ముందు ఉంచుతారని తెలిసింది.కథలో అంత స్కోప్ ఉంది కాబట్టే ఈ ఆలోచన జరుగుతోందని, బలవంతంగా సబ్జెక్టుని పొడిగించే ఉద్దేశం ఎంత మాత్రం లేదని సన్నిహితులతో వశిష్ట అన్నట్టు సమాచారం.

ఇటీవల కాలంలో చిరంజీవి ఖాతాలో సరైన హిట్ సినిమా పడి చాలా కాలం అయ్యింది.మరి ఈ సినిమా అయినా చిరుకు మంచి సక్సెస్ ని తెచ్చి పెడుతుందో లేదో చూడాలి మరి.కాగా బాహుబలి, కేజీఎఫ్ బాటలో చిరంజీవి వశిష్ట కాంబో మూవీ ఉండబోతుందంటూ కూడా వార్తలు వినిపిస్తున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube