టాలీవుడ్ ప్రముఖ హీరోయిన్లలో ఒకరైన రెండో పెళ్లి( Second Marriage ) గురించి గతంలోనే స్పందించి క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే.అయితే భర్త మరణం తర్వాత మీనా ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నారనే ప్రశ్నలకు సంబంధించి షాకింగ్ విషయాలు రివీల్ అయ్యాయి.
గతేడాది జూన్ లో మీనా భర్త విద్యాసాగర్( Meena Husband Vidya Sagar ) వేర్వేరు ఆరోగ్య సమస్యల వల్ల మృతి చెందారు.ఆ తర్వాత మీనా కెరీర్ పరంగా బిజీ అయినా భర్త చనిపోయారనే బాధ మనస్సులో అలానే ఉండిపోయింది.
మీనా ఫ్రెండ్ కాలా మాస్టర్ మీనా జీవితం గురించి మాట్లాడుతూ నాకు మీనా( Meena )తో మాత్రమే కాదని ఆమె ఫ్యామిలీతో కూడా మంచి ఫ్రెండ్ షిప్ ఉందని అన్నారు.మేము స్నేహితులుగా కంటే అక్కాచెల్లెళ్లలాగానే కలిసిపోయామని తెలిపారు.తనకు ఎలాంటి అవసరం వెంటనే మీనా ఇంటి దగ్గర వాలిపోతానని కాలా మాస్టర్ కామెంట్లు చేశారు.మీనా భర్త మరణించడానికి ముందు మూడు నెలల పాటు నేను వాళ్లింట్లో ఉన్నానని కాలా మాస్టర్ అన్నారు.
భర్త మరణం తర్వాత మీనా సాధారణ స్థితికి రావడానికి చాలా సమయం పట్టిందని కాలా మాస్టర్( Kala Master ) కామెంట్లు చేశారు.జీవితం చాలా ఉందని ఆ బాధ నుంచి బయటకు రావాలని మీనాకు ఏదేదో చెప్పేదానినని కాలా మాస్టర్ కామెంట్లు చేశారు.
రెండో పెళ్లి టాపిక్ తెస్తే మీనా నాతో గొడవ పడేదని ఆమె వెల్లడించారు.నీ పని నువ్వు చూసుకో అని సైలెంట్ గా ఉండని నా నోరు మూయించారని కాలా మాస్టర్ తెలిపారు.
మీనా తనకు కూతురు ఉందని అంతకుమించి నేను ఎలాంటి రిలేషన్స్ కోరుకోవడం లేదని చెప్పారని ఈ రెండు కారణాల వల్లే మీనా పెళ్లికి దూరంగా ఉందని అన్నారు.మీనా ఫ్రెండ్ కాలా మాస్టర్ చెప్పిన విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.