చైల్డ్ ఆర్టిస్ట్ గా సినీ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన మీనా ( Meena ) ఆ తర్వాత తన అందం అభినయంతో ఎంతోమంది స్టార్ హీరోలతో జతకట్టి స్టార్ హీరోయిన్ గా మారిపోయింది.ఇక గతంలో మీనాతో సినిమాలు చేయడానికి చాలామంది హీరోలు పోటీపడేవారు.
అంతేకాదు డేట్స్ ఖాళీగా లేక చాలా సినిమాల మీనా వదులుకోవాల్సి వచ్చిందట.ఇక పెళ్లి చేసుకుని కొద్దిరోజులు ఇండస్ట్రీకి దూరంగా ఉన్న మీనా ఆ తర్వాత మళ్లీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది.
అయితే గత ఏడాది మీనా తన భర్తను కోల్పోయింది.మీనా భర్త చనిపోయిన రెండు మూడు నెలలకే మీనా తన కూతురు కోసం రెండో పెళ్లి చేసుకోబోతుంది అంటూ ఎన్నో వార్తలు మీడియాలో చక్కర్లు కొట్టాయి.
అయితే ఈ వార్తలపై మీనా ఎన్నిసార్లు క్లారిటీ ఇచ్చినప్పటికి కూడా ఇవి ఆగడం లేదు.
అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మీనా ఈ విషయం గురించి మరోసారి స్పందించింది. నేను హీరోయిన్ గా చేసిన సమయంలో గ్లామర్ రోల్స్ హద్దు మీరేవి కావు.కానీ ఇప్పుడు చాలా హద్దులు మీరుతున్నాయి.
అప్పట్లో నాకు కేవలం రోజా గారితోనే ఎక్కువ పోటీ ఉండేది.ఎందుకంటే నాకు డేట్స్ ఖాళీగా లేకపోతే నేను వదిలేసిన సినిమాలు రోజా,రోజా ( Roja ) వదిలేసిన సినిమాలు నేను చేసేదాన్ని.
ఇక నా భర్త చనిపోయాక చాలామంది నాపై ఎన్నో రకాల వార్తలు రాసుకోస్తున్నారు.
నేను ధనుష్ ( Dhanush ) ని రెండో పెళ్లి చేసుకోబోతున్నానని, అలాగే ఓ రాజకీయ నాయకుడిని రెండో పెళ్లి చేసుకుంటున్నానని, బిజినెస్ మ్యాన్ ని పెళ్లి చేసుకుంటున్నానని ఇలా నా గురించి ఎవరు పడితే వారితో పెళ్లి వార్తలు రాసేసారు.ఆ సమయంలో నేను ఎన్నిసార్లు క్లారిటీ ఇచ్చినా కూడా ఆ వార్తలు ఆగలేదు.నా భర్త చనిపోయే ముందు నాకు నా భర్తకు గొడవలు వచ్చాయని కూడా ప్రచారం చేశారు.
కానీ అందులో కూడా ఎలాంటి నిజం లేదు.ఇలాంటి ప్రచారాల వల్ల ఫ్యామిలీకి ఎంతో ఇబ్బంది కలుగుతుంది.
ఇలాంటి వార్తలు ప్రచారం చేసేవాళ్ళు ఒకసారి మా ఫ్యామిలీ గురించి ఆలోచించాలి.అంటూ మీనా తన పెళ్లి వార్తలపై మరోసారి క్లారిటీ ఇచ్చింది.