ఈ మధ్య కాలంలో కొందరు వివాహేతర సంబంధాల మోజులో పడి వావి వరుసలు, వయసు భేదాలతో ఏమాత్రం సంబంధం లేనట్లు ప్రవర్తిస్తున్నారు.కాగా తాజాగా ఓ యువకుడు పెళ్లయిన మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని ఆ తర్వాత మహిళని కాదని వేరే యువతిని పెళ్లి చేసుకున్నాడని మహిళ యువకుడిని దారుణంగా హత్య చేయించిన ఘటన కర్ణాటక రాష్ట్రంలో వెలుగు చూసింది.
పూర్తి వివరాల్లోకి వెళితే స్థానిక రాష్ట్రంలో “కోలార్” పరిసర ప్రాంతంలో “జబీర్” అనే యువకుడు తన కుటుంబ సభ్యులతో నివాసముంటున్నాడు.అయితే జబీర్ కుటుంబ పోషణ నిమిత్తమై పలు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు అలాగే ఇతర వ్యాపారాలు చేస్తూ బాగానే డబ్బులు సంపాదించేవాడు.
అయితే జబీర్ చూడడానికి ఓ మోస్తరు అందంగా ఉండడమే కాకుండా సిక్స్ ప్యాక్ బాడీ కూడా ఉండేది.దీంతో ఆ మధ్య తన బంధువుల ఇంట్లో జరిగే ఫంక్షన్ కి వెళ్ళినప్పుడు పెళ్లయిన ఓ అందమైన మహిళతో పరిచయం ఏర్పడింది.
అయితే ఆ మహిళ భర్త కూడా వ్యాపారాలు చేస్తుండడంతో ఇద్దరికీ మాట మాట కలిసింది.ఈ క్రమంలో ఇరువురు ఫోన్ నెంబర్లు ఇచ్చి పుచ్చుకొని తరచూ మాట్లాడేవారు.
దీంతో ఈ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసింది.

దాంతో మహిళ తన భర్త ఇంట్లో లేనప్పుడు జబీర్ ని పిలిపించుకొని బాగానే ఎంజాయ్ చేసేది.ఈ క్రమంలో జుబీర్ తన ప్రియురాలి మోజులో పడి లక్షల రూపాయలను కూడా ముట్ట చెప్పాడు.కానీ ఇటీవలే జుబీర్ తన ఇంట్లో వాళ్లు కుదిర్చిన సంబంధం చేసుకుని క్రమక్రమంగా తన ప్రియురాలిని మర్చిపోయాడు.
దీంతో జుబీర్ పై కక్ష్య పెంచుకున్న తన ప్రియురాలు ఎలాగైనా హత మార్చాలని పన్నాగం పన్నింది.ఈ క్రమంలో డబ్బు తీసుకొని హత్యలు చేసే ముఠా తో ఒప్పందం కుదుర్చుకుని జబీర్ ని దారుణంగా హత్య చేయించింది.
దీంతో కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు ఫిర్యాదు నమోదు చేసుకున్న పోలీసులు విచారణలో భాగంగా ప్రియురాలిని అదుపులోకి తీసుకొని విచారించగా తానే తన ప్రియుడు జబీర్ ని హత్య చేయించినట్లు పోలీసుల ఎదుట నేరం అంగీకరించింది.