కొందరు నిజానిజాలు తెలుసుకోకుండా పెంచుకున్నటువంటి అనుమానం కారణంగా కటకటాల పాలవుతున్నారు.దీనివల్ల తమ అనుకున్న వాళ్ళ జీవితంలో తీవ్ర దుఃఖాన్ని మిగులుస్తున్నారు.
తాజాగా ఓ వివాహిత తన భర్త వేరే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడనే అనుమానంతో నిజానిజాలు తెలుసుకోకుండా ఏకంగా అతడిని చంపేందుకు కుట్ర పన్నిన ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లాలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే స్థానిక జిల్లాలోని భీమడోలు మండలం లోని ఓ గ్రామంలో గోవింద్ గురు నాథ్ అనే వ్యక్తి తన భార్య పిల్లలతో కలిసి నివాసముంటున్నాడు.
అయితే గోవింద్ కుటుంబ పోషణ నిమిత్తమై పాల వ్యాపారం చేస్తున్నాడు.అలాగే అతడి భార్య రాణి కూడా ఇంటి దగ్గరే చిన్నపాటి కొట్టు నడుపుతూ ఉండేది.అయితే గత కొద్ది కాలంగా తన భర్తపై అనుమానం పెంచుకున్నటువంటి రాణి ఎప్పుడు తన భర్త వేరే మహిళతో సంబంధం పెట్టుకున్నాడని వేధిస్తూ వస్తుండేది.ఈ అనుమానం కాస్త రోజురోజుకు ఎక్కువవుతుండటంతో చివరికి అతడిని హతమార్చాలని పన్నాగం పన్నింది.
ఈ క్రమంలో సులభంగా మనిషిని హతమార్చే మార్గాలను అన్వేషించడం మొదలుపెట్టింది.ఇందులో భాగంగా తన కన్న కొడుకు మరియు తన కుటుంబానికి సన్నిహితంగా ఉన్నటువంటి మరో వ్యక్తి ద్వారా సైనేడ్ గురించి తెలుసుకుంది.
అనుకున్నదే తడవుగా స్థానికంగా ఉన్నటువంటి మరో వ్యక్తి సహాయంతో సైనేడ్ తెప్పించి మటన్ కూరలో కలిపి తన భర్తకి గోవింద్ గురు నాథ్ కి పెట్టింది.అయితే భార్య పన్నాగాన్ని పసిగట్టినటువంటి గోవింద్ గురు నాథ్ వెంటనే దగ్గరలో ఉన్నటువంటి పోలీసులను సంప్రదించాడు.విషయం తెలుసుకున్న టువంటి పోలీసులు మటన్ కూరను స్వాధీనం చేసుకొని పరిశీలించగా అందులో సైడ్ కలిపినట్లు తేల్చారు.దీంతో వెంటనే గురునాథ్ భార్య రాణి మరియు ఆమెకు సహకరించినటువంటి మరో ఐదుగురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు.
విచారణ నిమిత్తమై రిమాండుకు తరలించారు.