ఈ మధ్య కాలంలో కొందరు వివాహేతర సంబంధాల మోజులో పడి కట్టుకున్న వారిని సైతం కడతేర్చటానికి ఏమాత్రం వెనకాడటం లేదు.కాగా తాజాగా ఓ వ్యక్తి ప్రేమించి పెళ్లి చేసుకొని చివరికి వేరే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో అది తట్టుకోలేక భార్య, బిడ్డలు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వెలుగు చూసింది.
పూర్తి వివరాల్లోకి వెళితే స్థానిక రాష్ట్రంలోని కోలార్ పరిసర ప్రాంతంలో హరీష్ అనే యువకుడు తన కుటుంబ సభ్యులతో నివాసముంటున్నాడు.కాగా హరీష్ కాలేజీలో చదువుకునే రోజుల్లోనే భానుప్రియ అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.
దీంతో ప్రస్తుతం వీరికి మూడు సంవత్సరాల కలిగినటువంటి పాప కూడా ఉంది.అయితే ఇటీవలే హరీష్ కి స్థానికంగా ఉన్నటువంటి ఓ మహిళతో పరిచయం ఏర్పడింది.దీంతో వీరిద్దరి మధ్య పరిచయం ఎక్కువవడంతో ఈ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసింది.దీంతో హరీష్ తన ప్రియురాలి పై ఉన్నటువంటి మోజుతో భార్యాబిడ్డలను వదిలించుకోవాలని అనుకున్నాడు.
ఈ క్రమంలో తరచూ సూటిపోటి మాటలతో తన భార్య భానుప్రియ ని అవమానిస్తూ చిత్రహింసలకు గురి చేసేవాడు.

అయినప్పటికీ తన కుటుంబ పరువు ప్రతిష్టల గురించి ఆలోచించిన భాను ప్రియ చాలా గుట్టుగా సంసారం చేసేది.కానీ ఈ మధ్య హరీష్ చేష్టలు ఎక్కువవడంతో తాజాగా భాను ప్రియ తన కూతురిని గొంతు నులిమి హత్య చేసి తాను కూడా ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.దీంతో భాను ప్రియ కుటుంబ సభ్యులు ఒక్కసారిగా కన్నీరు మున్నీరయ్యారు.
అంతేకాకుండా తమ కూతురుని అభం శుభం తెలియని వయసులో పెళ్లి చేసుకుని కష్టాల పాలు చేసిందే కాకుండా చివరికి ఆమెను ఆత్మహత్య చేసుకునేలా చేసిన హరీష్ ని కఠినంగా శిక్షించాలని పోలీసులను కోరుతున్నారు.దీంతో రంగంలోకి దిగిన పోలీసులు హరీష్ ని అదుపులోకి తీసుకుని విచారించగా వివాహేతర సంబంధాల మోజులో పడి తన భార్య బిడ్డలు నిర్లక్ష్యం చేశానని, అంతేగాక సూటిపోటి మాటలతో తన భార్యని వేదించానని నేరం అంగీకరించాడు.