ప్రస్తుత కాలంలో కొందరు వివాహేతర సంబంధాల మోజులో పడి కట్టుకున్న వారిని కడతేర్చటానికి కూడా ఏమాత్రం వెనకాడటం లేదు.కాగా తాజాగా ఓ మహిళ తన కంటే ఇరవై సంవత్సరాల వయసు ఎక్కువ ఉన్న వ్యక్తికి ఇచ్చి ఇష్టం లేని పెళ్లి చేశారని తన భర్త ని దారుణంగా హత్య చేసిన ఘటన కర్ణాటక రాష్ట్రంలో వెలుగు చూసింది.
పూర్తి వివరాల్లోకి వెళితే స్థానిక రాష్ట్రంలోని “మాండ్య” పరిసర ప్రాంతంలో “రమణి” (పేరు మార్చాం) అనే వివాహిత తన కుటుంబ సభ్యులతో నివాసముంటోంది.అయితే రమణికి 20 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు తనకంటే వయసులో 20 సంవత్సరాల పెద్దవాడైన వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేశారు.
అయితే రమణికి ఈ పెళ్లి ఏమాత్రం ఇష్టం లేకపోయినప్పటికీ తన కుటుంబ సభ్యుల బలవంతం మరియు ఆర్థిక పరిస్థితులు వంటి కారణంగా ఈ పెళ్లికి ఒప్పుకుంది.అయితే పెళ్లయిన మొదట్లో వీరిద్దరూ చాలా అన్యోన్యంగా ఉండే వాళ్ళు.
దీంతో వీరికి ప్రస్తుతం ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.అయితే ఈ మధ్యకాలంలో రమణి తన శృంగార జీవితంలో పెద్దగా సంతృప్తి చెందలేక పోయింది.
దీంతో వివాహేతర సంబంధాల వైపు మొగ్గు చూపింది.
ఈ క్రమంలో రమణి పొరుగింట్లో ఉన్న ఓ యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది.దీంతో పని నిమిత్తమై రమణి భర్త బయటకు వెళ్ళినప్పుడు తన ప్రియుడిని పిలిపించుకొని ఎంజాయ్ చేసేది.చివరికి వీరిద్దరి వ్యవహారం రమణి భర్తకు తెలియడంతో పలుమార్లు మందలించడంతో పాటు మరోమారు పక్కింటి కుర్రాడుతో కలిసి తిరిగితే పోలీసులకు ఫిర్యాదు చేస్తానని వార్నింగ్ ఇచ్చాడు.
అయినప్పటికీ రమణి మాత్రం తన తీరు ఏమాత్రం మార్చుకోలేదు.కాగా ఇటీవలే రమణి తన ప్రియుడితో బెడ్ రూమ్ లో కులుకుతుండగా రమణి భర్త కంట పడ్డారు.
దీంతో గొడవ జరగడంతో ఈ గొడవలో రమణి తన ప్రియుడితో కలిసి భర్తను హత మార్చింది.స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దగ్గరలో ఉన్నటువంటి ఆసుపత్రికి తరలించారు.
అలాగే రమణి ని అదుపులోకి తీసుకుని విచారించగా తమ వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని తానే తన ప్రియుడితో కలిసి తన భర్త ని హతమార్చినట్లు అంగీకరించింది.