Mark Antony : మార్క్ ఆంటోనీ హిట్ అవడంతో డైరెక్టర్ కు లగ్జరీ కార్ గిఫ్ట్ గా ఇచ్చిన నిర్మాత?

మామూలుగా ఒక సినిమాను తెరకెక్కించినప్పుడు ఆ సినిమా సక్సెస్ అయితే ఆ సినిమా నిర్మాత చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు అన్న విషయం తెలిసిందే.కోట్లు ఖర్చు పెట్టిన సినిమాకు అసలు తో పాటు లాభం వచ్చినప్పుడు ఆ దర్శకుడు ఆనందం మాటల్లో చెప్పలేనంతగా ఉంటుంది.

 Mark Antony Producer Vinoth Gifts Director Adhik Ravichandran A Brand New Bmw-TeluguStop.com

అటువంటి సమయంలోనే కొన్ని కొన్ని సార్లు నిర్మాతలు ఓట్లు లక్షలు ఖరీదు చేసే కార్లను గిఫ్ట్ లుగా ఇస్తూ ఉంటారు.మొన్నటికి మొన్న జైలర్ సినిమా( Jailer Movie ) నిర్మాత సినిమా హిట్ అయినందుకు గాను బహుమతులు ఇచ్చిన విషయం తెలిసిందే.

ఇప్పుడు మరో నిర్మాత తనకు హిట్ ఇచ్చిన దర్శకుడి రుణం తీర్చుకున్నాడు.


విశాల్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం మార్క్ ఆంటోని( Mark Antony ). ఈ సినిమా విడుదల అయ్యి తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది.ఎటువంటి అంచనాలు లేకుండా విడుదల అయినా ఈ సినిమా ఓవరాల్‌గా రూ.100 కోట్లకు పైనే కలెక్షన్స్ సాధించింది.ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్‌లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది.

మార్క్ ఆంటోని సినిమాలో విశాల్ కంటే ఎస్‌జే సూర్య నటనకే ఎక్కువ మార్కులు పడ్డాయి.టైమ్ ట్రావెల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ మూవీ తెలుగులో డీసెంట్ టాక్ అందుకుంది.

ఈ చిత్రంతో హిట్ కొట్టిన అధిక్ రవిచంద్రన్‌ని నిర్మాత వినోద్ సర్‌ప్రైజ్ చేశాడు.దాదాపు రూ.90 లక్షలు విలువైన బీఎండబ్ల్యూ కారు ఇచ్చాడు.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

అంతేకాకుండా అందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube