పులిని చూసి నక్క వాతపెట్టుకుందంట.. అలా ఉంది ఈ ఇండస్ట్రీల పరిస్థితి!

టాలీవుడ్ లో అగ్ర దర్శకుడుగా వెలుగొందుతున్నాడు జక్కన్న.ఈయన ఇప్పటి వరకు ఒక్క ప్లాప్ కూడా చూడలేదు.

 Mani Ratnam Ponniyin Selvan 1, Ponniyin Selvan 1, Mani Ratnam, Kollywood, Tollyw-TeluguStop.com

బాహుబలి సినిమాతో ఇండియన్ సినిమాను శాసించే స్థాయికి ఎదిగాడు.ఇక ఇటీవలే వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమాతో మరోసారి ట్రెండ్ సెట్ చేసి ఈయన స్థానాన్ని మరింత పదిలం చేసుకున్నాడు.

ఇక జక్కన్న బాహుబలిని ఎప్పుడు అయితే తెరకెక్కించి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడో అప్పటి నుండి ఇటు కోలీవుడ్ అటు బాలీవుడ్ ఇండస్ట్రీలు బాహుబలిని మించి విజయం సాధించాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి.

అయితే ఈ ప్రయత్నాలన్నీ బెడిసి కొడుతున్నాయి.

దీంతో ఈ రెండు ఇండస్ట్రీల పరిస్థితి పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు ఉంది అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు.ఈ రెండు ఇండీస్ట్రీల నుండి బాహుబలి తర్వాత భారీ బడ్జెట్ తో భారీ సెట్టింగులతో సినిమాలను పోటీగా దింపారు.

కానీ ఒక్కటంటే ఒక్క సినిమా కూడా బాహుబలి స్థాయిని కాదు కదా.ఆ సినిమాలు దరిదాపుల్లో కూడా చేరలేక పోయాయి.

Telugu Bahubali, Bollywood, Kollywood, Mani Ratnam, Maniratnam, Ponniyin Selvan,

బాహుబలి భారీ విజయం తర్వాత కోలీవుడ్ లో పులి సినిమాను పోటీగా రిలీజ్ చేసారు.ఈ సినిమాలో విజయ్ హీరోగా నటించాడు.130 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా విజయ్ క్రేజ్ వల్ల కాస్త కలెక్షన్స్ సాధించింది కానీ లేకపోతే మరింత ఘోరంగా విఫలం అయ్యింది.ఆ తర్వాత బాలీవుడ్ కూడా ఇదే పంథాలో కలంక్ సినిమాను రిలీజ్ చేయగా బాలీవుడ్ కు బిగ్ షాక్ ఇచ్చింది.

భారీ తారాగణంతో భారీ ఖర్చుతో తెరకెక్కిన ఈ సినిమా భారీ నష్టాలను చవిచూడక తప్పలేదు.

Telugu Bahubali, Bollywood, Kollywood, Mani Ratnam, Maniratnam, Ponniyin Selvan,

ఇక పృథ్వీరాజ్, రీసెంట్ గా వచ్చిన బ్రహ్మాస్త్ర సినిమాల పరిస్థితి కూడా వీటికి భిన్నంగా ఏం లేదు.ఇక ఇప్పుడు కోలీవుడ్ ప్రెస్టీజియస్ గా తీసుకుని రిలీజ్ చేసిన పొన్నియన్ సెల్వన్ కూడా కోలీవుడ్ కు ఊహించని షాక్ ఇచ్చింది.బాహుబలి స్థాయిలో ఆకట్టు కోవాలని చేసిన ప్రయత్నాలు విఫలం అయ్యాయనే చెప్పాలి.

మణిరత్నం తెరకెక్కించిన ఈ సినిమా దారుణంగా విఫలం అయ్యిందనే చెప్పాలి.సెప్టెంబర్ 30న గ్రాండ్ గా రిలీజ్ అయినా ఈ సినిమా దారుణమైన టాక్ తెచ్చుకోవడంతో మరోసారి ఎదురు దెబ్బ తప్పలేదు.

ఈ సినిమాపై తమిళ్ ప్రేక్షకులు చాలా అంచనాలు పెట్టుకున్నారు.మన బాహుబలిని మించి ఉంటుంది అని సోషల్ మీడియాలో ఎప్పటి నుండో డప్పు కొట్టుకున్నారు.

మా నుండి కూడా బాహుబలి వస్తుంది అంటూ రచ్చ రచ్చ చేసారు.కానీ రిలీజ్ తర్వాత చుస్తే బాహుబలితో ఏమాత్రం పోటీ పడలేక చేతులెత్తేసింది.

పులిని చూసి నక్కను వాతపెట్టుకోవడం అంటే ఇదే అంటూ సోషల్ మీడియాలో ఇప్పుడు కామెంట్స్ వినిపిస్తున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube