నేటి కాలం మహిళలకు అత్త అంటే పడని విషయం తెలిసిందే.అత్తమామలను సరిగా చూసుకునే కోడళ్లు ఎక్కడో అరుదుగా కనిపిస్తారు.
ఇక కొడుకులే సరిగా తల్లిదండ్రులను పట్టించుకోని సమాజంలో అత్తలను వచ్చిన కోడళ్లూ ప్రేమగా చూడాలని ఆశించడం అత్యాశనే అవుతుంది.
కానీ ఒక కొడుకు మాత్రం తన తల్లిని కట్టుకున్న భార్య సరిగ్గా చూడటం లేదని ఆమె ప్రాణాన్ని గాల్లో కలిపేసిన ఉదంతం రాజేంద్రనగర్ లో వెలుగు చూసింది.
ఆ వివరాలు చూస్తే.అసిఫాబాద్ జిల్లా మంచిర్యాలకు చెందిన రవి ఉపాధి నిమిత్తం తన తల్లి, భార్య సమతలతో కలిసి రాజేంద్ర నగర్ హైదర్ గూడ లో నివాసముంటున్నాడు.
ఈ క్రమంలో అత్తాకోడళ్ల మధ్య సఖ్యత లేకపోవడం వల్ల తరచుగా ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి.దీంతో విసిగిపోయిన రవి తన తల్లిని సరిగ్గా చూసుకోవడం లేదనే బాధలో మంగళవారం రాత్రి మద్యం తాగొచ్చి భార్యతో గొడవపడిన క్రమంలో క్షణికావేశంలో గొంతు నులిమి హత్య చేసాడు.
ఇక స్దానికులు ఇచ్చిన సమాచారంతో ఘటనా స్దలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నారట.