బర్త్‌డే పార్టీ కోసం హోటల్‌లో కుక్కతో పరాచకాలు.. చివరకు?

ప్రస్తుత రోజులలో ఏ క్షణాన ఏమి జరుగుతుందో కూడా ఎవరికీ అర్థం అవ్వని పరిస్థితులు ఏర్పడ్డాయి.ఉన్నట్టుండి హఠాత్తుగా గుండెపోటు రావడం, లేదా అనుకోని విధంగా యాక్సిడెంట్లు జరగడం లాంటివి జరిగి ప్రాణాలు కోల్పోవడం చాలానే మీడియా ద్వారా రోజు తెలుసుకుంటున్నాము.

 Man Falls To Death Chasing Dog On Third Floor Of Hotel In Hyderabad Viral Detail-TeluguStop.com

అచ్చం అలాంటి సంఘటన ఒకటి హైదరాబాద్ నగరంలో తాజాగా చోటు చేసుకుంది.అప్పటి వరకు స్నేహితులతో కలిసి పుట్టిన రోజు వేడుకలలో పాల్గొన్న ఓ యువకుడు, పార్టీ మధ్యలో బయటకు వచ్చి కుక్కతో పరాచకాలు ఆడి చివరకు ప్రాణాలు కోల్పోయాడు.

ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే.

Telugu Chanda Nagar, Hotel Tragedy, Hyderabad, Uday Kumar, Vv Hotel, Young-Lates

హైదరాబాద్ చంద్రానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వీవీ ప్రైడ్ హోటల్‌ లో స్నేహితుల బర్త్ డే పార్టీలో పాల్గొన్న ఉదయ్ అనే యువకుడు.పార్టీ మధ్యలో నుంచి బయటకు వచ్చి కుక్కతో కాసేపు సరదాగా ఆడుకున్నాడు.అనంతరం కుక్కతో పాటు పరుగులు పెడుతూ దానిని ఆడించడం మొదలుపెట్టాడు.

ఈ క్రమంలో కిటికి వైపు వెళ్లి.అనుకోకుండా కిటికీలో నుంచి కింద పడి ప్రాణాలను కోల్పోయాడు.

వీవీ ప్రైడ్ హోటల్లోని మూడవ అంతస్తు నుంచి కింద పడడంతో ఉదయ్ కుమార్ అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలియజేశారు.విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే హోటల్ వద్దకు చేరుకొని డెడ్ బాడీని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ హాస్పిటల్ కు తరలించారు.

పోలీసులు కేసును నమోదు చేసుకొని విచారిస్తున్నారు.

Telugu Chanda Nagar, Hotel Tragedy, Hyderabad, Uday Kumar, Vv Hotel, Young-Lates

ఇకపోతే, చనిపోయిన ఉదయ్ పాలిటెక్నిక్ స్టూడెంట్ గా పోలీసులు గుర్తించారు.సోమవారం ఘటన జరిగినప్పటికీ.ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

అయితే, ఘటనకు సంబంధించిన దృశ్యాలు హోటల్ లో ఉన్న సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి.ఇదివరకు కూడా డెలివరీ కోసం వెళ్లిన జొమాటో బాయ్ కూడా కుక్క వెంటపడటంతో మూడవ అంతస్తు పైనుంచి కింద పడి మృతి చెందిన విషయం తెలియ చేసారు.

ఈ ఘటనతో ప్రజలు ఎంత అప్రమత్తంగా ఉండాలో అర్థమవుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube