మద్యం మత్తులో మందుబాబులు ఎం చేస్తారో వాళ్ళకే తెలియదు.ఫుల్ గా తాగారు అంటే లోకమంతా వారిదే అన్నట్టు వారికీ ఇష్టం వచ్చినట్టు చేస్తారు.
ఇంకా ఈ నేపథ్యంలోనే ఓ యువకుడు తగిన మైకంలో ఏకంగా పెట్రోల్ పోసేసుకున్నాడు.ఈ ఘటన నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండల కేంద్రంలో చోటు చేసుకుంది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.పెయింటర్ గా పనిచేస్తున్న స్వామి అనే యువకుడు తనని తానే మరిచిపోయేంత మద్యం తాగాడు.దీంతో తాగిన మత్తులో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తి ఉన్నట్టుండి అతనితో తెచ్చుకున్న పెట్రోల్ ని శరీరం మీద పోసుకొని నిప్పంటించుకున్నాడు.అది గమనించిన స్థానికులు మంటలు ఆపేసి చికిత్స నిమిత్తం నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
అయితే ఆ యువకుడు ఇది చెయ్యడం మొదటి సారి కాదు గత సంవత్సరం కూడా ఇలానే పీకల్లోతు తాగి వాటర్ ట్యాంక్ ఎక్కి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు.ఇప్పుడు ఏకంగా మద్యం మత్తులో పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు.
అతని మానసిక పరిస్థితి బాగాలేదు అని, అయితే ఇప్పుడు ఆరోగ్య పరిస్థితి కాస్త నిలకడగా ఉన్నట్టు డాక్టర్లు తెలిపారు.