Maaza : దుమ్ముదులుపుతోన్న మాజా... రెండే రెండు సంవత్సరాలలో బిలియన్‌ డాలర్‌ బ్రాండ్‌గా అడుగులు!

మాజా డ్రింక్ తెలియని వారు ఇక్కడ దాదాపు ఉండరనే చెప్పుకోవాలి.కేవలం గ్యాస్ తో కూడిన కూల్ డ్రింక్స్ రాజ్యమేలుతున్న సమయంలో గ్యాస్ లేకుండా వచ్చిన సంచలన సాఫ్ట్ డ్రింక్ ఇది.

 Maaza Become A Billion Dollar Brand In Two Years , Maaza ,dollars Brand, Viral-TeluguStop.com

ఇకపోతే రెండు సంవత్సరాలలో మాజా సాఫ్ట్‌ డ్రింక్‌ కూడా బిలియన్‌ డాలర్‌ బ్రాండ్‌గా ఎదుగుతుందని కోకా–కోలా ప్రెసిడెంట్‌ సంకేత్‌ రే తాజాగా పేర్కొన్నారు.వాస్తవానికి 2023లోనే ఈ మైలురాయి సాధించవచ్చని ఊహించినప్పటికీ ప్రతికూల వాతావరణ పరిస్థితులు, మామిడి గుజ్జు ధరలు పెరిగిపోవడం మొదలైన అంశాల వలన కాస్త డిలే అయిందని తెలుస్తోంది.

2024 నాటికి మాత్రం తమ లక్ష్యాన్ని తప్పకుండా సాధించి తీరుతామని రే ఈ సందర్భంగా చెబుతున్నారు.ఈ కంపెనీకి చెందిన థమ్స్‌ అప్, స్ప్రైట్‌ సాఫ్ట్‌ డ్రింకులు ఈ ఏడాదే బిలియన్‌ డాలర్‌ బ్రాండ్‌లుగా ఎదిగిన సంగతి అందరికీ తెలిసినదే.

ఈ క్రమంలో అల్ఫాన్సో రకం మామిడి గుజ్జు నుండి తయారు చేసే మాజా కూడా సదరు మైలురాయిని అందుకొనే అవకాశాలు మెండుగా వున్నాయి.అలా అయితే పోర్ట్‌ఫోలియోలో ఇది మూడో స్థానాన్ని దక్కించుకోనుంది.

రిలయన్స్‌ రిటైల్, టాటా కన్జూమర్‌ ప్రోడక్ట్స్‌ (టీసీపీఎల్‌) వంటి దిగ్గజాలు కూడా శీతల పానీయాల విభాగంలోకి ప్రవేశిస్తుండటంపై స్పందిస్తూ.ఇది సానుకూల పరిణామమేనని రే అభిప్రాయపడ్డారు.

Telugu Dollars, Latest, Maaza, Rare, Soft-Latest News - Telugu

ప్రస్తుత సర్వే ప్రకారం ఈ డ్రింకుకి రోజురోజుకీ మార్కెట్‌ విపరీతంగా పెరిగిపోతుందని తెలుస్తోంది.రే మాట్లాడుతూ… వినియోగదారులకు ఈ డ్రింక్ మరింత క్వాలిటీ తో అందించబడుతుందని చెప్పుకొచ్చారు.ధరపరంగా కూడా రాబోయే రోజుల్లో స్థానిక స్థాయిలో కొన్ని పెను మార్పులు చోటు చేసుకుంటాయని అన్నారు.అయితే పెంచుతారో, తగ్గిస్తారో చెప్పకపోవడం కొసమెరుపు.రిలయన్స్‌ రిటైల్‌ ఇటీవలే దేశీ బ్రాండ్‌ కాంపా కోలాను కొనుగోలు చేయగా, TCPL క్రమంగా బెవరేజెస్‌ మార్కెట్లో విస్తరిస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube