కొమురం భీం జిల్లా గన్ మిస్ఫైర్ ఘటనలో కానిస్టేబుల్ మృతి చెందారు.కౌటాల పోలీస్ స్టేషన్ లో టీఎస్ఎస్పీ కానిస్టేబుల్ గన్ మిస్ ఫైర్ అయినట్లు సమాచారం.
కాగా, కానిస్టేబుల్ రజినీ కుమార్ సెంట్రీగా విధులు నిర్వహిస్తున్నారు.మిస్ ఫైర్ అయిన ఘటనలో కానిస్టేబుల్ రజినీ కుమార్ తలకు తీవ్రగాయం అయింది.
ఈ నేపథ్యంలో ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందారు.రజినీ కుమార్ కావాలనే కాల్చుకున్నాడా, లేక మిస్ ఫైర్ అయ్యిందా అనే విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.