ఆ హీరోయిన్ టచ్ తో మహేష్ పూర్తిగా మారిపోయారట.. ఏం జరిగిందంటే?

మహేష్ బాబు ప్రస్తుతం నటిస్తున్న సర్కారు వారి పాట సినిమాపై మొదట్లో పెద్దగా అంచనాలు లేవనే సంగతి తెలిసిందే.హీరోయిన్ కీర్తి సురేష్ వరుస ఫ్లాపుల్లో ఉండటం, దర్శకుడు పరశురామ్ సక్సెస్ రేట్ తక్కువగా ఉండటంతో అభిమానులు ఈ సినిమా పై మరీ భారీగా అంచనాలను ఏర్పరచుకోలేదు.

 Mahesh Babu Playing Interesting Role In Sarkaru Vari Paata Details, Mahesh Babu,-TeluguStop.com

హిందీలో ఈ సినిమా రిలీజవుతుందో లేదో అభిమానులకు క్లారిటీ లేదనే సంగతి తెలిసిందే.

అయితే కళావతి సాంగ్ రిలీజైన తర్వాత సర్కారు వారి పాట సినిమాపై అంచనాలు పెరిగాయి.

రొమాంటిక్ మెలోడీగా తెరకెక్కిన ఈ పాట శ్రోతలను ఎంతగానో ఆకట్టుకుంటోంది.అయితే కళావతి పాట రిలీజైన తర్వాత సర్కారు వారి పాట కథ గురించి కూడా కొన్ని విషయాలు లీక్ అయ్యాయి.

సినిమాలో కీర్తి సురేష్ మహేష్ ను కౌగిలించుకునే సమయంలో కళావతి పాట వస్తుందని సమాచారం అందుతోంది.

మహేష్ ఫస్టాఫ్ లో పొగరు ఉన్న కుర్రాడిగా కనిపిస్తారని మహేష్ పాత్ర రఫ్ గా ఉంటుందని బోగట్టా.

మహేష్ బాబు గతంలో పోషించిన పాత్రలకు భిన్నమైన పాత్రలో ఈ సినిమాలో కనిపించనున్నారు.సినిమాలో కళావతి పాత్ర టచ్ తో పూర్తిగా మారిపోయేలా మహేష్ పాత్ర ఉందని తెలుస్తోంది.మహేష్ బాబు కెరీర్ లోని బ్లాక్ బస్టర్ హిట్లలో ఈ సినిమా నిలుస్తుందనే కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

మే నెల 12వ తేదీన ఈ సినిమా రిలీజ్ కానుండగా ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా మొదలయ్యాయని సమాచారం అందుతోంది.ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ డైరెక్షన్ లో ఒక సినిమాలో, రాజమౌళి డైరెక్షన్ లో ఒక సినిమాలో మహేష్ బాబు నటించనున్నారు.సినిమాసినిమాకు మహేష్ కు క్రేజ్ పెరుగుతుండగా కెరీర్ విషయంలో మహేష్ ఆచితూచి అడుగులు వేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube