ఈ మధ్య కాలంలో మన టాలీవుడ్ లో చాలా మంది యంగ్ బ్యాచ్ పరిచయం అయ్యారు.వారిలో చాలా మంది తమ టాలెంట్ తో క్లిక్ అయ్యారు.
ఇక తాజాగా మన టాలీవుడ్ లోకి మరో యంగ్ బ్యాచ్ తమ అదృష్టం పరీక్షించు కోవడానికి ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ఈ యంగ్ బ్యాచ్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ బావమరిది నర్నె నితిన్ కూడా ఉన్నాడు.
నార్నె నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ లు హీరోలుగా గౌరీ ప్రియా, అనంతిక, గోపిక ఉదయన్ హీరోయిన్లుగా తెరకెక్కిన లేటెస్ట్ యూత్ ఫుల్ మూవీ ”మ్యాడ్( Mad Movie )”.ఈ మూవీ నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఈ సినిమాను డైరెక్టర్ కళ్యాణ్ శంకర్( Director Kalyan Shankar ) తెరకెక్కించగా ప్రమోషనల్ కంటెంట్ తోనే హైప్ క్రియేట్ అయ్యేలా చేయడంతో చిత్ర యూనిట్ సక్సెస్ అయ్యింది.
ఇక మంచి హైప్ తో నిన్న గ్రాండ్ గా ఈ సినిమా రిలీజ్ అవ్వగా మొదటి షో తోనే మంచి టాక్ తెచ్చుకుంది.సినిమా ఆద్యంతం ఫన్ అండ్ హిలేరియస్ టాక్ అందుకుంది.అంతా కొత్త నటీనటులు అయినప్పటికీ యువ నటులంతా తమ సహజమైన నటనతో ఆడియెన్స్ ను ఆకట్టు కున్నారు.
అలాగే కామెడీతో కూడా కడుపుబ్బా నవ్వించి ప్రేక్షకుల నుండి మంచి ఫీడ్ బ్యాక్ కూడా అందుకున్నారు.
ఇదిలా ఉండగా మంచి టాక్ రావడంతో ఈ సినిమా ఓపెనింగ్స్ బాగా రాబట్టినట్టు తెలుస్తుంది.యూత్ ను ఆకట్టుకుని సాలిడ్ ఓపెనింగ్స్ కూడా రాబట్టింది.వరల్డ్ వైడ్ గా ఈ సినిమా 1.8 కోట్ల గ్రాస్ ను అందుకుందని తెలుస్తుంది.మొత్తం కొత్త నటీనటులతో తీసిన ఈ సినిమా అంత ఓపెనింగ్స్ అందుకోవడం సెన్సేషన్ అనే చెప్పాలి.
కాగా సితార ఎంటర్టైన్మెంట్స్ అండ్ ఫార్చ్యూన్ 4 సినిమాస్ వారు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకు భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించాడు.రఘుబాబు, కేవీ అనుదీప్( Anudeep Kv ) తదితరులు కీలక పాత్ర పోషించారు.