జాతీయ పార్టీ అయిన భాజాపాలో రాష్ట్ర అధ్యక్షులు మార్పు పెద్ద విషయమేమీ కాదు.సహజంగానే మూడు నాలుగు సంవత్సరాలకు ఒకసారి రాష్ట్ర అధ్యక్షుల ను మార్చడం భాజపాల్లో సహజమే అయినప్పటికీ ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ కుమార్తె ,మాజీ కేంద్ర మంత్రి పురందేశ్వరి( Former Union Minister Purandeshwari ) కి రాష్ట్ర అధ్యక్షురాలుగా బాధ్యతలు అప్పజెప్పడం వెనక భాజపా దీర్ఘకాల వ్యూహం ఉందని ఒక ప్రత్యేక ప్రణాళిక ప్రకారమే ఆమెకు బాధ్యతలు అప్పజెప్పినట్టుగా ప్రచారం జరుగుతుంది.
ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో బలపడాలని ఎప్పటినుంచో ప్రయత్నాలు చేస్తున్న భాజపాకు తెలంగాణలో కొన్ని అవకాశాలు దక్కినప్పటికీ ఆంధ్ర ప్రదేశ్ ( Andhra Pradesh )లో ఉన్న ప్రత్యేక రాజకీయ పరిస్థితుల కారణంగా భాజపాకు అవకాశం దక్కలేదు ముఖ్యంగా 1990 ప్రాంతాలలో కొంత ఆదరణ దక్కినప్పటికీ తదనంతర పరిణామాలతో ప్రాంతీయ పార్టీలు బలంగా ఉండటం కేంద్రంలో ఆంధ్రప్రదేశ్ కు వ్యతిరేక నిర్ణయాలలో భాజపా పాలు పంచుకోవడంతో ఆంధ్రుల లో భాజపా పట్ల ఒక రకమైన వ్యతిరేక భావం నెలకొని ఉన్నది.
ముఖ్యంగా ప్రత్యేక హోదా ఇవ్వకపోవడం, రాష్ట్రాన్ని విడదీసిన కాంగ్రెస్కు మద్దతు తెలపడం వంటి వ్యవహారాలు ఆంధ్రులకు భాజపాను దూరం చేశాయి.అయితే ఏమీ లేని చోట కూడా ఏదో ఒక ప్రయత్నం చేసి ముందుకు వెళ్లాలని చూసే భాజపాకు ఆంధ్రప్రదేశ్లో కూడా రాజకీయంగా కొన్ని దారులు కనిపిస్తున్నాయని, అందులో ముఖ్యంగా రెండు ప్రాంతీయ పార్టీలలో ఒకటి బలహీన పడితే ఆ స్థానాన్ని ఆక్రమించాలని ఆలోచిస్తున్న కమలనాధులు తెలుగుదేశం ( Telugudesam )పై ప్రత్యేక ఫోకస్ పెట్టారని చంద్రబాబు నాయుడు( Chandrababu Naidu ) వయసు రీత్యా మరెంతో కాలం తెలుగుదేశాన్ని యాక్టివ్గా నడపలేకపోవచ్చు అని అప్పుడు కచ్చితంగా ఆంధ్ర ప్రదేశ్ లో రాజకీయ సూన్యత ఏర్పాటు ఏర్పడుతుందని భావిస్తున్న భాజపా తెలుగుదేశం అనుకూల వర్గాలను తెలుగుదేశానికి మద్దతు ఇచ్చే సామాజిక వర్గాలను తమ వైపుకు తిప్పుకొని రాజకీయంగా ఎదగాలన్న ఆలోచనతోనే ఆ సామాజిక వర్గానికి చెందిన చిన్నమ్మకు పగ్గాలు అప్ప చెప్పారని, భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్లో పూర్తిస్థాయి రాజకీయ పార్టీగా ఎదగాలన్న ముందుచూపుతోనే ఆమె పేరును పరిగణ లోకి తీసుకున్నారని విశ్లేషణలు వస్తున్నాయి.
ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్లో ఎంపీ సీట్ల పరంగా భాజపాకు అనుకూల వాతావరణ కనిపిస్తున్నప్పటికీ ఇతరుల మద్దతుపై ఆధారపడటం కన్నా తామే స్వయంగా ఎదగాలన్న దీర్ఘకాల ఆలోచనతోనే చిన్నమ్మని ని ఎంపిక చేస్తున్నట్లుగా తెలుస్తుంది.ఇప్పటివరకు కమ్మ సామాజిక వర్గం తెలుగుదేశానికి రెడ్డి సామాజిక వర్గం వైఎస్ఆర్ సీపీకి( YSRCP ) మద్దతు ఇస్తున్నారన్న అంచనాలు ఉండగా మూడో ఫోర్స్ అయిన కాపులను నమ్ముకున్న భాజపా గత రెండుసార్లు ఆ సామాజిక వర్గానికి చెందిన నాయకులకు అధ్యక్ష బాధ్యతలు అప్పజెప్పింది.అయితే సరైన ఫలితాలు పొందకపోవడంతో తమ వ్యూహాన్ని మార్చి ఇప్పుడు కమ్మ సామాజిక వర్గానికి చెందిన కీలక నేతకు బాధ్యతలు అప్పజెప్పడం ద్వారా ముందుకు వెళ్లాలని ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది
.