కదులుతున్న తులసి చెట్టు.. ఎక్కడంటే..?

ప్రపంచంలో అనేక వింతలు, విశేషాలు రోజూ చోటుచేసుకుంటూ ఉంటాయి.ఒక్కొక్కసారి అద్భుతాలు జరుగుతూ ఉంటాయి.

 Video Of Moving Tulsi Plant Leaves Going Viral Details, Tulsi Tree, Viral Lates-TeluguStop.com

ఈ అద్భుత విషయాలు అందరినీ అబ్బురపరుస్తూ ఉంటాయి.ఈ అద్భుతాలను చూసి కొంతమంది నోరెళ్లబెడితే.

మరికొంతమంది షాక్ అవుతూ ఉంటారు.తాజాగా ఆశ్చర్యానికి గురి చేసే మరో అద్భుతం చోటుచేసుకుంది.

ఒక తులసి చెట్టు( Tulsi Tree ) కదులుతుంది.దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.

ఇంట్లో పెరట్లో లేదా ఇంటి ముందు చాలామంది తులసి చెట్టును పెంచుకుంటారు.మరికొంతమంది పూల కుండీలలో తులసి చెట్టును పెంచుకుంటారు.తులసి చెట్టును దైవస్వరూపంగా హిందూవులు భావిస్తారు.రోజూ దానికి పూజలు చేయడంతో పాటు ప్రదక్షిణలు కూడా చేస్తూ ఉంటారు.మరికొంతమంది తులసి చెట్టుకు దీపారాధన రోజూ చేస్తూ ఉంటారు.అలాగే తులసి ఆకుల్లో కూడా ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి.దీంతో కొంతమంది ఆరోగ్యం కోసం తులసి ఆకులను( Tulsi Leaves ) కూడా తింటూ ఉంటారు.

హిందూవులు( Hindus ) దైవంగా భావించే తులసి చెట్టు కదులుతుండటం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తుంది.దీంతో ఇది దేవుడి మహిమ అంటూ చూడటానికి చాలామంది వస్తున్నారు.ఈ సంఘటన ఎక్కడ జరిగిందో తెలియదు కానీ.

వీడియో మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఈ వీడియోలో తులసి చెట్టు అటూ, ఇటూ కదులుతుంది.దీనిని చూస్తుంటే తులసి చెట్టు ప్రదక్షిణలు చేస్తున్నట్లుగా ఉంది.

ఈ వీడియో ఎవరు పోస్ట్ చేశారో తెలియదు కానీ.ఇప్పుడు సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్స్ ఫేస్‌బుక్, ట్విట్టర్, వాట్సప్‌లలో ఎక్కడ చూసినాా కనిపిస్తుంది.ఈ వీడియోను చూసి చాలామంది షాక్ అవుతున్నారు.

తులసి చెట్టు కదలడం ఏంటని ఆశ్చర్యపోతున్నారు.ఇదొక అద్భుతమంటూ కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు.

సృష్టిలో ఇలాంటి అద్భుతాలు ఎన్నో జరుగుతూ ఉంటాయని అంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube