బడుగు బలహీన వర్గాల నాయకుడు, దివంగంత నేత వంగవీటి మోహన రంగా( Vangaveeti Mohana Ranga ) 76వ జయంతి సందర్భంగా ఆయన అభిమానులు రాష్ట్ర వ్యాప్తంగా అనేక సామాజిక కార్యక్రమాలు నిర్వహించారు .రాధా( Radha ) మిత్రమండలి ఆధ్వర్యంలో జరిగిన ఒక కార్యక్రమానికి వంగవీటి రంగా తనయుడు వంగవీటి రాధా హాజరయ్యారు.
తన తండ్రి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన రాధా కార్యక్రమానికి వచ్చిన అభిమానులను ఉద్దేశించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేసినట్లుగా తెలుస్తుంది.వంగవీటి మోహనరంగా కుల.మత, ప్రాంతాలకు అతీతంగా బలహీనవర్గాల కోసం నిలబడిన వ్యక్తి అని ఆయనను ఒక కులానికి అంటగట్టి చిత్రీకరించే ప్రయత్నాలు జరగడం బాధాకరమని ఆయన చెప్పుకొచ్చారు.
ఆయన పేరును చెప్పుకొని ఆయన అనుచరులం అని చెప్పుకొని రాజకీయంగా ( Political )కొంతమంది నాయకులు కీలక స్థానాలకు చేరారని ఆ తర్వాత ఆయనను మర్చిపోయారని రాధా ఆవేదన వ్యక్తం చేశారు.ఆయనపై అభిమానం ఉందని చెప్పుకుంటున్న కొంతమంది నాయకులు కొన్ని పార్టీలు ఆయన పేరును జిల్లాకు ఎందుకు పెట్టలేదని రాధా నిలదీశారు.ఆయన మరణించి ఇన్ని సంవత్సరాలు అవుతున్నా కూడా ఆయనపై అభిమానం చెక్కుచెదరని రీతిలో ఉందంటే ఆయన సమాజంపై ఎంత స్ఫూర్తిదాయకమైన ముద్రవేశారో తనకు అర్థమవుతుందంటూ ఆయన భావోద్వేగానికి గురయ్యారు.
వంగవీటి మోహనరంగా అభిమానులంతా రాజకీయాలతో పాటు అనేక రంగాల్లో సంఘటతంగా ఉండాల్సిన అవసరం ఉందని అప్పుడే ఆయన ఆశయాల అమలు సాధ్యమవుతుందంటూ కూడా ఆయన అభిమానులకు సూచించారు.తన తండ్రి 1985లో చైతన్య రదమనే( Chaitanya Radmane ) సినిమాను నిర్మించారని ఆ సినిమా ఇప్పటికీ విడుదలకు నోచుకోలేదని ఇటీవల అమెరికాలో ఆయన అభిమానులు ఆ సినిమాను రిలీజ్ చేశారని ,తెలుగుదేశాల్లో కూడా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని ఆయన చెప్పుకొచ్చారు.ముఖ్యంగా వంగవీటి రంగా పేరును జిల్లాకు పెట్టాలని ఆయన అభిమానులు గట్టిగా డిమాండ్ వినిపించినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందుకు సుముఖంగా లేని కారణం గా అది కార్యరూపం దాల్చలేదు.మరి వంగవీటి రాధ విమర్శలపై అధికార వైసిపి ఏ విధంగా ప్రతిస్పందిస్తుందో చూడాలి
.