ప్రస్తుత రోజుల్లో ప్రపంచం రోజురోజుకీ మారిపోతూ ఉంది.ముఖ్యంగా కరోనా వచ్చాక ఎక్కడ.? ఎప్పుడు.? ఏం జరుగుతుందో ఎవరికి అర్థం కావడం లేదు.ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం తాండవం చేస్తుంది.చాలా కంపెనీలు మూత పడిపోతున్నాయి.టాప్ మోస్ట్ కంపెనీలు సైతం చెప్పాకుండా ఉద్యోగాలు పీకేస్తున్నాయి.ఇలాంటి తరుణంలో ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ వార్షిక సర్వే ప్రపంచంలో అత్యంత ఖరీదైన నగరాల లిస్ట్ రిలీజ్ చేసింది.
ఈ లిస్టులో ప్రపంచంలో అత్యంత ఖరీదైన నగరంగా న్యూయార్క్ సిటీ మొదటి స్థానంలో నిలిచింది.రెండో స్థానంలో సింగపూర్, మూడో స్థానంలో ఇజ్రాయిల్ దేశానికి చెందిన టెల్ అవీవ్, నాలుగో స్థానంలో చైనా కి చెందిన హాంగ్ కాంగ్, ఐదో స్థానంలో అమెరికాకు చెందిన లాస్ ఏంజిల్స్, ఆరో స్థానంలో స్విజర్లాండ్ కి చెందిన జూరిచ్, ఏడవ స్థానంలో జెనీవా, ఎనిమిదవ స్థానంలో శాన్ ఫ్రాన్సిస్ కో, తొమ్మిదవ స్థానంలో ఫ్రాన్స్ దేశానికి చెందిన ప్యారిస్, పదవ స్థానంలో ఆస్ట్రేలియా దేశానికి చెందిన సిడ్ని నిలిచాయి.