'లియో' డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ మొదటి చిత్రం 'నగరం' అప్పట్లో ఎంత వసూళ్లను రాబట్టిందో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

ప్రస్తుతం సౌత్ ఇండియా లో రాజమౌళి మరియు శంకర్ తర్వాత టాప్ డైరెక్టర్స్ ఎవరు అనే లిస్ట్ తీస్తే అందులో లోకేష్ కనకరాజ్( Lokesh Kanagaraj ) పేరు కచ్చితంగా ఉంటుంది.తమిళ హీరో కార్తీ నటించిన ‘ఖైదీ’ చిత్రం( Khaidi Movie ) ద్వారా ఈ డైరెక్టర్ బాగా పాపులారిటీ ని సంపాదించాడు.

 Leo' Director Lokesh Kanakaraj's First Film 'nagaram' Would Be Surprised To Know-TeluguStop.com

ఈ సినిమా అప్పట్లో ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిల్చిందో మన అందరికీ తెలిసిందే.ఈ సినిమా తర్వాత ఆయన దర్శకత్వం వహించిన ‘మాస్టర్’ చిత్రం కూడా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.

ఈ రెండు సినిమాల తర్వాత ఆయన తీసిన ‘విక్రమ్’ చిత్రం అయితే ఇండస్ట్రీ లో ఉన్న రికార్డ్స్ అన్నిటిని బద్దలు కొట్టి సుమారుగా 500 కోట్ల రూపాయిల గ్రాస్ ని రాబట్టింది.అలాంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఆయన మళ్ళీ విజయ్ తో కలిసి ‘లియో’ ( LEO )అనే చిత్రం చేసాడు.

Telugu Karthi, Khaidi, Kollywood, Nagaram, Sundeep Kishan, Tollywood-Movie

ఈ సినిమా పై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో మనమంతా చూస్తూనే ఉన్నాము.తమిళ ప్రేక్షకులతో పాటుగా , తెలుగు ప్రేక్షకులు కూడా ఈ సినిమా టికెట్స్ కోసం యుద్దాలు చేస్తున్నారు.అక్టోబర్ 19 వ తారీఖున విడుదల అవ్వబోతున్న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజు వంద కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబడుతుందని అంటున్నారు ట్రేడ్ పండితులు.ఇలా సౌత్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ మొత్తం తన వైపు చూసేలా చేసుకున్న లోకేష్ మొదటి చిత్రం ‘నగరం’.

సందీప్ కిషన్ హీరో గా నటించిన ఈ సినిమాని తొలుత ‘మా నగరం’ అనే టైటిల్ తో తమిళం లో రిలీజ్ చేసాడు.అక్కడ సూపర్ హిట్ అవ్వడం తో తెలుగు లో ‘నగరం‘ ( Nagaram )పేరుతో విడుదల చేసారు.

ఈ సినిమా అప్పట్లో ఎంత వసూళ్లు రాబట్టింది అనేది ఇప్పటి ఆడియన్స్ కి తెలీదు.కానీ మాకు అందిన సమాచారం ప్రకారం , ఈ సినిమా ఫుల్ రన్ కలెక్షన్స్ తెలుగు మరియు తమిళం కలిపి ఎంత వచ్చిందో చెప్పబోతున్నాము.

Telugu Karthi, Khaidi, Kollywood, Nagaram, Sundeep Kishan, Tollywood-Movie

ఈ చిత్రం అప్పట్లో కేవలం తమిళనాడు నుండి 10 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది అట.అప్పట్లో 10 కోట్లు గ్రాస్ అంటే చాలా పెద్ద విషయమే, అలాగే తెలుగు లో ఈ చిత్రానికి దాదాపుగా నాలుగు కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి.మొత్తం మీద రెండు భాషలకు కలిపి 7 కోట్ల రూపాయిలు షేర్ వసూళ్లు వచ్చాయి అన్నమాట. కమర్షియల్ గా పెద్ద సక్సెస్ అయ్యింది.కథ కథనం మొత్తం ఖైదీ చిత్రం తర్వాత ‘నగరం’ చిత్రం లోనే బాగుంటుంది.ఇప్పటి వరకు ఎవరైనా ఈ సినిమా చూడకుండా ఉంటే యూట్యూబ్ లో అందుబాటులో ఉంది వెంటనే చూసేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube