కేజీఎఫ్ సిరీస్ తో ఇండియన్ వైడ్ గా పాపులారిటీ సొంతం చేసుకున్నారు డైరెక్టర్ ప్రశాంత్ నీల్.( Prashanth neel) కన్నడ భాష నుంచి వచ్చి ప్రపంచ వ్యాప్తంగా 1200 కోట్లు కలెక్ట్ చేసిన చిత్రంగా కేజీఎఫ్ చాప్టర్2 అరుదైన రికార్డ్ ని సృష్టించింది.
ఈ మూవీతో ప్రశాంత్ నీల్ అలాగె యశ్ భారీగా గుర్తింపును తెచ్చుకున్నారు.ఇకపోతే ప్రశాంత్ నీల్ గత ఏడాది చివర్లో డార్లింగ్ ప్రభాస్ హీరోగా నటించిన సలార్ మూవీ సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది.
దీనికి కొనసాగింపుగా పార్ట్ 2 శౌర్యంగ పర్వం త్వరలో సెట్స్ పైకి వెళ్లబోతోంది.
ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ సిరీస్ ని రెండు భాగాలు చేశాడు.ఇప్పుడు సలార్ కి అదే ఫార్ములా కొనసాగిస్తున్నాడు.సలార్ పార్ట్ 2 మీద భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.
మొదటి పార్ట్ 700 కోట్లకి పైగా కలెక్షన్స్ అందుకుంది.పార్ట్ 2తో వెయ్యి కోట్లకి పైగా వసూళ్లు సాధించాలనే లక్ష్యంతో చిత్ర యూనిట్ ఉంది.
దీని తర్వాత ప్రశాంత్ నీల్ జూనియర్ ఎన్టీఆర్ తో మూవీ చేయబోతున్న సంగతి తెలిసిందే.వచ్చే ఏడాది ఈ సినిమాలు పట్టాలు ఎక్కే అవకాశం ఉంది.
ఈ సినిమా గురించి ఇంటరెస్టింగ్ న్యూస్ ఒకటి బయటకొచ్చింది.కేజీఎఫ్ తరహాలోనే హైవోల్టేజ్ పవర్ యాక్షన్ ప్యాక్డ్ కథతోనే మూవీ ఉంటుందంట.
ఇండియన్ మైథాలజీలోని క్యారెక్టర్స్ స్ఫూర్తితో ప్రశాంత్ నీల్ ఈ కథని రెడీ చేస్తున్నారట.అలాగే ఈ మూవీ కూడా రెండు భాగాలుగానే భారీ బడ్జెట్ తో తెరకెక్కించే ఏర్పాట్లు జరుగుతున్నాయి.మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు.కచ్చితంగా తారక్ కెరియర్ గుర్తుండిపోయే చిత్రాన్ని ప్రశాంత్ నీల్ అందిస్తాడని అందరూ ఆంచనా వేస్తున్నారు.జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ( Koratala Siva) దర్శకత్వంలో దేవర మూవీ( Devara) చేస్తున్నాడు.ఈ మూవీ షూటింగ్ చివరి దశకి వచ్చేసింది.
దీని తర్వాత హిందీలో వార్ 2 మూవీ షూటింగ్ లో జాయిన్ అవుతాడు.వార్ 2లో కాస్తా నెగిటివ్ షేడ్స్ ఉన్న హీరోగా తారక్ కనిపిస్తాడంట.
దీని తర్వాత ప్రశాంత్ నీల్ మూవీ సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది.