ఓహో ... లగడపాటి సర్వేలు ఇలా ఉంటాయా ..?

లగడపాటి రాజగోపాల్ ఈ పేరు బాగా ఫేమస్.ఎందుకంటే ఈ మాజీ ఎంపీ గారి సర్వేలు చాలా ఫేమస్.

 Lagadapati Rajagopal Latest Survey On Ap Elections-TeluguStop.com

ఎప్పటికప్పుడు రాజకీయ పరిస్థితుల గురించి, ఏ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది.? ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి.? ఇలా… అనే అంశాల గురించి రకరకాలుగా విశ్లేషిస్తూ రాజగోపాల్ సర్వే లు ఉంటాయి.అందుకే ఈయన ప్రస్తుతం రాజకీయాల్లో లేకపోయినా ఈయనకు డిమాండ్ మాత్రం బాగా ఉంది.అందుకే… ఇతడిని చేరదీసేందుకు అన్ని రాజకీయ పార్టీలు ఎదురుచూస్తుంటాయి.ఈయనకు ఆంధ్రా ఆక్టోపస్ అనే బిరుదు కూడా ఉంది.

ఈయన అసలు సర్వేలు ఎలా చేయిస్తారు.? దేని ఆధారంగా సర్వే లు ఉంటాయి.? అన్న విషయాలు అందరికీ ఆసక్తికరమే.తాజాగా లగడపాటి సర్వేలపై కొన్ని వార్తలు వార్తలు బయటపడడంతో … ఈయన సర్వేలపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

అసలు సర్వేలు చేయించడం ఆషామాషీ వ్యవహారం కాదు క్షేత్రస్థాయిలో తిరగడానికి జనం నాడి తెలుసుకోవడానికి చాలామంది సిబ్బందే కావాలి.రోజుకి కనీసం ఒక్కొక్కరికి 500 వరకు ఖర్చు పెట్టాలి.ఇలా చూసుకుంటే వందల మంది పని చేయాల్సి ఉంటుంది.కానీ ఈ విధంగా ఉంటున్నట్టు ఎక్కడా కనిపించడం లేదు.ఎన్నికలు సమీపిస్తుండడంతో ఆయన హడావుడి చేస్తున్నారు.కొంతమంది నేతలు లగడపాటి వ్యవహారంపై ఆరా తీయగా సర్వేల పేరుతో హడావిడి చేయడం వెనుక అసలు కథ వేరే ఉందని చెబుతున్నారు.

ఆయనకు బ్యాంకుల్లో 55 వేల కోట్లు వరకు అప్పు ఉందని .అందుకోసమే రాజకీయ పార్టీలకు అనుకూలంగా సర్వేలు చేయించి పబ్బం గడుపుకుంటారు అని చెప్పుకొస్తున్నారు .

ఇంకొంతమంది నేతలు అయితే లగడపాటి సర్వే లు చేయించాడని.ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కొడుకు సర్వేలు చేయించడంలో బాగా ఫేమస్ అని ఆయన అభిప్రాయాలను లగడపాటి తెలుసుకుని తన సర్వేలో చెప్తున్నాడని వీరు చెబుతున్నారు.గత ఎన్నికల్లో కాంగ్రెస్ కు అనుకూలంగా ఉన్నాయని చెప్పి మార్కులు కొట్టేయడానికి ప్రయత్నించారు .అయితే అది నిజం కాకపోవడంతో సైలెంట్ అయిపోయారు.మళ్ళీ ఇప్పుడు ఎన్నికల్లో పోటీ చేసేందుకు సర్వేల పేరుతో హడావుడి చేస్తున్నారని కొంతమంది నేతలు చెవులు కొరుక్కుంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube