టాలీవుడ్ లో యంగ్ టాలెంట్ తో తనకంటూ స్పెషల్ గుర్తింపు తెచ్చుకుంటూ దూసుకు పోతున్నాడు కిరణ్ అబ్బవరం. ఈయన ముందు నుండి కూడా ఆడియెన్స్ ను మెప్పించగల సినిమాలను సెలెక్ట్ చేసుకుంటూ ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు.
ఒక్కో సినిమా ఒక్కో విభిన్నంగా ఎంచుకుంటూ స్పెషల్ క్రేజ్ తెచ్చుకున్న ఈ యంగ్ స్టార్ ఇటీవలే సమ్మతమే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.
ఈ సినిమా కూడా ప్రేక్షకులను మెప్పించడంతో డీసెంట్ హిట్ కొట్టాడు.
ఈ సినిమా మంచి హిట్ తో మరిన్ని సినిమాలను లైన్లో పెట్టుకుంటూ పోతున్నాడు.తాజాగా కిరణ్ అబ్బవరం మరొక కొత్త సినిమాను ప్రకటించాడు.
ఈ రోజు కిరణ్ అబ్బవరం పుట్టిన రోజు సందర్భంగా కొత్త సినిమా టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా ప్రకటించాడు.
మైత్రి మూవీ మేకర్స్ వారు క్లాప్ ఎంటెర్టాన్మెంట్ తో కలిసి ఒక సినిమా నిర్మిస్తున్న విషయం ఈ రోజు అనౌన్స్ చేసారు.
గోపీచంద్ మలినేని దగ్గర అసోసియేట్ డైరెక్టర్ గా పనిచేసిన రమేష్ కదురి ఈ సినిమాతో డైరెక్టర్ గా పరిచయం అవ్వనున్నాడు.
ఈ సినిమాకు ‘మీటర్’ అనే పక్కా మాస్ టైటిల్ ను ఫిక్స్ చేసారు.ఈ పోస్టర్ లో కిరణ్ అబ్బవరం మాస్ లుక్ లో అలరిస్తున్నాడు.
టైటిల్ ఇంకా ఫస్ట్ లుక్ పోస్టర్ ను బట్టి ఇది పక్కా మాస్ ఎంటర్టైనర్ అని తెలుస్తుంది.
అందుకే ఈ టైటిల్, పోస్టర్ రెండు కూడా ప్రేక్షకులను ఆకర్షించడంతో మొదటిరోజే ఈ సినిమాకు మంచి అంచనాలు ఏర్పడ్డాయి.ఇక ఈ సినిమాలో కిరణ్ అబ్బవరంకు జోడీగా అతుల్య రవి హీరోయిన్ గా నటిస్తుంది.
మరి ఈ సినిమాతో కిరణ్ అబ్బవరం మరొక హిట్ అందుకుంటాడో లేదో వేచి చూడాల్సిందే.