సోషల్ మీడియాలో క్యాట్ వీడియోలు నెటిజన్లను బాగా ఆకట్టుకుంటాయి.ముఖ్యంగా అవి నిద్రపోతూ చేసే పనులు చూసి నెటిజనులు మైమరిచి పోతుంటారు.
అయితే సాధారణంగా పిల్లులు ఒక రోజులో 14 నుంచి 18 గంటల వరకు నిద్ర పోతాయి.కొన్ని పిల్లులు 18 గంటల కంటే ఎక్కువగానే కునుకుతీస్తాయి.
ఇలా పడుకున్న సమయంలో అవి ఒక్కోసారి వింతగా ప్రవర్తిస్తాయి.తాజాగా ఒక పిల్లి ఎవరూ ఊహించని విధంగా ప్రవర్తించి అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.
దీనికి సంబంధించిన వీడియోని వైరల్ హాగ్ షేర్ తయారుచేసింది.
వైరల్ అవుతున్న వీడియోలో ఒక తెల్ల పిల్లి ఒక షెల్ఫ్ లో నిద్రపోవడం చూడవచ్చు.
అయితే అది బాగా నిద్ర మత్తులో ఉన్నట్లు ఉంది.అలాగే కలవరిస్తూ ఉన్నట్లు కనిపించింది.
అలా సెల్ఫ్ లో పడుకున్న ఆ పిల్లి ఒక్కసారిగా పరిగెత్తినట్టు చేసింది.దాంతో అది కింద పడింది.
అయినా కూడా దాని నిద్ర మత్తు వదల లేదు.అయితే షెల్ఫ్ కిందే మెత్తటి పరువు ఉండటంతో దానికి ఎలాంటి దెబ్బ తాకలేదు.
దాంతో అది మొద్దు నిద్ర లోనే ఉండిపోయింది.
ఈ వీడియో చూసిన నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
కొందరు ఆశ్చర్యపోతున్నారు.వామ్మో, ఇది ఇంతలా మొద్దు నిద్ర పోతుంది ఏంటి? అని మరికొందరు నోరెళ్లబెడుతున్నారు.ఈ పిల్లి నిద్ర లో ఒక ఎలుకను తరుముతున్నట్టు ఉందని ఒక యూజర్ కామెంట్ చేశారు.ఇదేమైనా యుద్ధంలో ఫైట్ చేస్తుందేమో, అప్పుడే దానికి బుల్లెట్ తగిలినట్లుంది.అందుకే అలా కింద పడిపోయిందని ఇంకో యూజర్ ఫన్నీగా కామెంట్ చేశాడు.“అంటే పిల్లులు ఎప్పుడూ కాళ్ల మీదనే ల్యాండ్ కావు.ఇలా బాడీపై కూడా పడిపోతుంటాయని ఇప్పుడు తెలిసింది” అని ఒక నెటిజన్ కామెంట్ పెట్టాడు.ఈ ఫన్నీ వీడియో పై మీరు కూడా ఓ లుక్కేయండి.