Archana Jois : కేజీఎఫ్ సినిమా తర్వాత అన్నీ అలాంటి పాత్రలే వస్తున్నాయి.. అర్చన జైస్ కామెంట్స్ వైరల్!

కేజిఎఫ్.ఈ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

 Kgf Fame Archana Jois Comments Viral-TeluguStop.com

ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కోట్లలో కలెక్షన్స్ రాబట్టింది.పాన్ ఇండియా లెవెల్ లో విడుదల అయ్యి అన్ని భాషల్లోనూ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.

సినిమాలోని ప్రతి పాత్ర అభిమానులను బాగా ఆకట్టుకుంది.అయితే అన్నీ పాత్రల్లలో కల్లా రాఖీభాయ్​తో పాటు అమ్మ పాత్ర విమర్శకుల ప్రశంసలను ఎక్కువగా అందుకుంది.

ఆ అమ్మ పాత్ర చేసిన నటి అర్చ‌న జైస్.అయితే ఈ పాత్ర కోసం తనను బలవంతం చేసి ఎలా ఒప్పించారో మరోసారి చెప్పిదామె.

Telugu Archana Jois, Bollywood, Kgf, Kollywood, Prashanth Neel, Yash-Movie

ఈ సినిమా తర్వాత ఆమెకు పాపులారిటీ ఏ రేంజ్ లో పెరిగిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.కాగా ఈ సినిమాలో అమ్మ పాత్రలో నటించిన అర్చన జైస్( Archana Jois ) ఈ సినిమాలో తన పాత్ర గురించి, తనను ఏ విధంగా ఒప్పించారు అన్న విషయం గురించి తెలిపింది.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.నాకు 20, 21 ఏళ్లు ఉంటాయి.టీమ్ కాల్​ చేసి ఛాన్స్ ఉందని చెబితే షాక్​ అయ్యాను.నా వయసు తెలుసా? అమ్మా క్యారెక్టరా? అని అన్నాను.నిజానికి అప్పుడు కథ కూడా వినడానికి సిద్ధంగా లేను.చాలా ఒప్పించడానికి ప్రయత్నాలు చేశారు.కానీ ఆ తర్వాత ఓ కామన్​ ఫ్రెండ్​.

Telugu Archana Jois, Bollywood, Kgf, Kollywood, Prashanth Neel, Yash-Movie

కనీసం స్క్రిప్ట్ అయినా విను, పెద్ద ప్రొడక్షన్ హౌస్​ నుంచి వచ్చినా ఆఫర్​ కదా అని చెబితే కథ విన్నాను.కథ విన్నాక కూడా అంత ఎగ్జైట్ అనిపించలేదు.అయినా ఇక ఆ తర్వాత చేసేశాను.

నేను ఒక క్లాసికల్ డ్యాన్సర్​.కానీ ఇప్పుడు కేజీయఫ్​ సాధించిన విజయం, అందులో నా పాత్రకు దక్కిన ఆదరణ ఎంతో ఆనందంగా ఉంది అని అర్చన తెలిపింది.

ఇకపోతే కేజీయఫ్​ తర్వాత తన లైఫ్​ ఎలా మారిందో కూడా వివరించింది అర్చన.నాకు యశ్​( Yash )తో ఎటువంటి సన్నీవేశాలు లేవు.

రెండో భాగంలో ఒకటే ఉంటుంది.కాబట్టి ఆయనతో చేసిన సీన్​ కోసం ఏమీ ప్రాక్టీస్​ చేయలేదు.

కేజీయఫ్​( KGF ) తర్వాత పర్సనల్​ లైఫ్ అలానే ఉంది.ప్రొఫెషనల్​ లైప్ మాత్రం చాలా మారింది.

పాపులారిటీ ఫేమ్ దొరికింది.సినిమా అవకాశాల విషయానికొస్తే అలాంటి అమ్మ పాత్రలే వస్తున్నాయి.

కానీ మరిన్ని మంచి అవకాశాల కోసం ఎదురుచూస్తున్నాను అని అర్చన తెలిపింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube