ఇటీవలే టీడీపీ కి రాజీనామా చేసి వైసీపీ లో చేరిన విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేశినేని నాని( kesineni nani ) వచ్చే ఎన్నికల్లో వైసీపీ నుంచి విజయవాడ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయడం ఖాయం అయ్యింది.2014, 2018 ఎన్నికల్లో స్వామిదాసు పోటీ చేసి విజయం సాధించారు.టిడిపి నుంచి రెండోసారి విజయం సాధించిన తర్వాత కేశినేని నానికి పార్టీలో ఇబ్బందులు మొదలయ్యాయి .టిడిపి ఆయనను దూరం పెడుతూ రావడం , దానికి తగ్గట్లుగానే నాని కూడా టిడిపిలోని కొంతమంది నాయకులపై విమర్శలు చేయడం తదితర కారణాలతో ఆ పార్టీకి దూరంగానే ఉంటూ వస్తున్నారు.ఇటీవల తిరువూరులోని టిడిపి కార్యాలయంలో చోటు చేసుకున్న వివాదంను పరిష్కరించే క్రమంలో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని నానికి టిడిపి అధిష్టానం తేల్చి చెప్పింది. దీంతో ఆయన టిడిపికి రాజీనామా చేసి వైసిపి కండువా కప్పుకున్నారు.
ఈ సందర్భంగా నాని విజయవాడ పార్లమెంట్ పరిధిలో తన పట్టు నిరూపించుకునే ప్రయత్నం మొదలుపెట్టారు. వైసిపి ఎంపీ అభ్యర్థిగా తన పేరును ఖరారు చేసుకోవడంతో పాటు , తనకు అత్యంత సన్నిహితుడైన తిరువూరు మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామి దాసుకు కూడా ఎమ్మెల్యే సీటును ఇప్పించుకున్నారు. దీంతో నాని చెప్పిన వాళ్లకు నాలుగో జాబితాలో సీటు ఖరారు అయింది. నల్లగట్ల స్వామిదాసు మొదటి నుంచి కేసునేని నాని కి అనుకూలంగా ఉంటూ వస్తున్నారు. తిరువూరు నియోజకవర్గంలో నాని ప్రతినిధిగా పదేళ్ల నుంచి ఆయన వ్యవహరిస్తున్నారు.1994 , 99 అసెంబ్లీ ఎన్నికల్లో తిరువూరు నుంచి గెలిచిన స్వామిదాస్ కు ఆ తర్వాత గెలుపు దక్కలేదు.అయినా ఆయన టిడిపిలోనే కొనసాగుతూ వస్తున్నారు .
2014లో టిడిపి అభ్యర్థిగా తిరువూరు నుంచి పోటీ చేసి ఓటమి చెందారు.2019 ఎన్నికల్లో స్వామికి టికెట్ నిరాకరించి అప్పటి మంత్రి జవహర్ కు తిరువూరు అసెంబ్లీ టికెట్ ఇచ్చారు చంద్రబాబు. దీంతో స్వామి దాసుకు పోటీ చేసే అవకాశం రాలేదు .ఇప్పుడు కేశినేని నాని వైసిపి కండువా కప్పుకోవడంతో ఆయన బాటలోనే స్వామిదాసు కూడా వెళ్లారు.ఇటీవల జగన్ తో భేటీ అయిన కేసినేని నాని తనకు ఎంపీ టికెట్ తో పాటు, స్వామిదాసు కు తిరువూరు టికెట్ ఇస్తే గెలిపించుకుని వస్తానని హామీ కూడా ఇవ్వడంతో , జగన్ నాలుగో జాబితాలో స్వామిదాస్ పేరును ఖరారు చేశారట.