భారతదేశంలో అత్యంత పర్యాటక సుందరమైన రాష్ట్రం కేరళ( Kerala ) అని అందరికీ తెలుసు.కేరళలో ఉండే పచ్చదనం మరియు ప్రకృతి అందాలు పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి.
ఒక విధంగా చెప్పాలంటే కేరళ పర్యాటక రాష్ట్రంగా కూడా పిలుస్తుంటారు.ఈ క్రమంలో అక్కడి రాష్ట్ర ప్రభుత్వం పర్యాటకం పై కూడా ప్రత్యేకమైన శ్రద్ధ పెడుతూ బడ్జెట్ లో కూడా పర్యాటకానికి ప్రత్యేకమైన నిధులు కూడా కేటాయిస్తూ ఉంటుందని చెబుతుంటారు.
అటువంటి కేరళ రాష్ట్రంలో దేశంలోనే అతి పొడవైన గాజు వంతెన( Longest Glass Bridge ) ప్రారంభించడం జరిగింది.కేరళ పర్యాటక శాఖ మంత్రి మహమ్మద్ రియాస్( Kerala Minister Muhammed Riyas ) కేరళ ఇడుక్కి జిల్లాలో ఈ గాజు వంతెనను ప్రారంభించారు.
42 మీటర్లు ఉండే ఈ బ్రిడ్జ్ ను ఏకకాలంలో 15 మంది ఎక్కే అవకాశం ఉంది.పర్యాటకులకు కొత్త అనుభూతిని కలిగించే రీతిలో సముద్ర మట్టానికి 3600 అడుగుల ఎత్తులో ఈ వంతెనను నిర్మించారు.ఈ వంతెన ఎంట్రీ ఫీజు 500 రూపాయలుగా నిర్ణయించినట్లు జిల్లా టూరిజం ప్రమోషన్ కౌన్సిల్ అధికారులు వెల్లడించారు.ఈ గ్లాస్ వంతెననీ( Glass Bridge ) పిపిపి భాగస్వామ్యంతో మూడు కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించడం జరిగిందట.
ఈ గాజు వంతెన నిర్మాణం కోసం జర్మనీ నుంచి దిగుమతి చేసుకున్న 35 టన్నుల స్టీల్ వినియోగించినట్లు అధికారులు స్పష్టం చేశారు.