తన వివాహేతర సంబంధానికి అడ్డు వస్తుందని ఏకంగా తన భర్త తల్లిని హతమార్చింది ఓ నవ తరం ఇల్లాలు.ఈ ఘటన తెలంగాణ రాష్ట్రంలోని కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే స్థానిక జిల్లాలోని ఓ గ్రామంలో ఓ మహిళ తన కొడుకుకి అదే ప్రాంతానికి చెందిన టువంటి నందన అనే యువతితో వివాహం చేసింది.అయితే నందనకి తన మేనబావ అయినటువంటి మరో వ్యక్తితో పెళ్లికాక ముందు నుంచే అక్రమ సంబంధం ఉంది.
ఇది గమనించిన ఆమె అత్త పలుమార్లు ఈ విషయం గురించి హెచ్చరించింది.అంతేగాక ఇంకోసారి తన మేనబావని కలిస్తే పోలీసులకు ఫిర్యాదు చేస్తానని హెచ్చరించింది.దీంతో ఆమెపై నందన కక్ష పెంచుకుంది.
అంతేగాక తన వివాహేతర సంబంధానికి అడ్డు వస్తుందని ఏకంగా తన అత్తని హత్య చేసేందుకు పన్నాగం పన్నింది.ఇందులో భాగంగా అందరూ పడుకున్న సమయంలో పెద్ద బండరాయితో తన అత్త తలపై గట్టిగా కొట్టి చంపేసింది.ఈ హత్యని ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ఆమెపై కిరసనాయిలు పోసి అని పెట్టింది.
ఆ తరువాత తన అత్త ఆత్మహత్య చేసుకుందని అందరినీ నమ్మించింది.
అయితే ఆమె తీరుపై అనుమానం వచ్చినటువంటి తన భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
దీంతో విచారణలో భాగంగా పోలీసులు నందనని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటకు వచ్చింది.ఇందులో భాగంగా తన మేన బావతో తనకి అక్రమ సంబంధం ఉందని అది ఎక్కడ బయట పడుతుందోనని అది తెలిసినటువంటి తన అత్తని తానే హతమార్చానని నేరం ఒప్పుకుంది.
దీంతో పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి విచారణ నిమిత్తమై రిమాండుకు తరలించారు.