అగ్ర రాజ్యం అమెరికాకు అతిపెద్ద సమస్య ఏదైనా ఉందటే అది గన్ కల్చర్ మాత్రమే.అమెరికా పరువును ప్రపంచ దేశాల ముందు తీసేస్తున్న ఈ గన్ కల్చర్ కు వ్యతిరేకంగా ఏళ్ళ తరబడి ఎన్నో ఉద్యమాలు, నిరసలు జరిగాయి, ఒక వైపు గన్ కల్చర్ వద్దంటున్న ప్రజలు, మరో వైపు ర్ కావాలంటున్న ప్రజలు , ఇంకో పక్క అతి పెద్ద లాబియింగ్ చేస్తూ గన్ కల్చర్ కు మద్దతునిస్తున్న అమెరికా రైఫిల్ అసోసియేషన్ అంతేకాదు ఈ గన్ కల్చర్ కు ఎంతో మంది రాజకీయ నాయకుల అండదండలు.
ఇలా ఎంతో మందిని కాదని మెజారిటీ నిర్ణయం గౌరవిస్తూ అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ కీలక నిర్ణయం తీసుకున్నారు.
గన్ కల్చర్ అమెరికన్స్ వ్యక్తిగత రక్షణ కోసమని ఎలాంటి పరిస్థితుల్లోనూ ఈ చట్టాన్ని రద్దు చేయలేమని సుప్రీం కోర్టు అనుకూల నిర్ణయం వెల్లడించిన విషయం అందరికి తెలిసిందే.
ఈ క్రమంలోనే బిడెన్ సుప్రీంకోర్టు తీర్పుపై అభ్యంతరం వ్యక్తం చేసారు కూడా.అమెరికాలో రోజుకు సగటున రెండు చోట్ల తుపాకి పేలుళ్లు జరుగుతాయని ప్రతీ ఏటావేలాది మంది గన్ కల్చర్ కారణంగా మృతి చెందుతున్నారని అమాయకపు ప్రజలు, చిన్న పిల్లలు బలై పోతున్నారని సర్వేలు చెప్తున్నా కోర్టు గన్ కల్చర్ కు మద్దతుగా తీర్పు ఇవ్వడంతో బిడెన్ ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించారు.
అమెరికాలో ఇకపై తుపాకుల వినియోగం ఉండకూడదని చిన్ని పిల్లల చేతిలో కేవలం పుస్తకాలు మాత్రమే ఉండాలని పిలుపునించారు.ఈ క్రమంలోనే గన్ కల్చర్ పై నియంత్రణ బిల్లును తీసుకువచ్చారు.అమెరికా ప్రజలను తుపాకుల నుంచీ కాపాడేందుకు ఈ బిల్లు తప్పకుండా ఉపయోగపడుతుందని బిడెన్ తెలిపారు.ఈ బిల్లు అమలులోకి వస్తే చిన్న పిల్లలకు తుపాకులు ఇచ్చే విషయంపై కటినమైన వైఖరి తీసుకోవడమే కాకుండా అర్హత పొంది తుపాకులు వాడే వారు ప్రమాదకరమైన పద్దతులను పాటిస్తే వారి లైసెన్స్ లు నిలిపివేయబడేలా చర్యలు ఉంటాయని, అలాంటి వారికి తుపాకి లైసెన్స్ మరో సారి ఇవ్వకుండా ఉండేలా చర్యలు ఉంటాయని బిడెన్ తెలిపారు.