జయం సినిమా చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు ఎలా ఉందో మీకు తెలుసా?

సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న వారు ఎంతో మంది ఉన్నారు.అయితే సినిమాలలో నటించిన చైల్డ్ ఆర్టిస్టులను కొన్ని సంవత్సరాల తర్వాత చూస్తే ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించినది వీళ్లేనా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

 Jayam Movie Child Artist Yamini Swetha Details, Jayam Movie, Child Artist Yamin-TeluguStop.com

అలా గుర్తుపట్టలేని విధంగా వారు మారిపోతూ ఉంటారు.అలా చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న వారిలో యామిని శ్వేతా కూడా ఒకరు.

యామిని శ్వేత అంటే చాలామంది గుర్తుపట్టక పోవచ్చు కానీ, జయం సినిమాలో హీరోయిన్ సదా చెల్లెలు క్యారెక్టర్ లో నటించిన ఆమె అంటే చాలు ఇట్టే గుర్తుపట్టేస్తారు.

ఆ సినిమా అంతలా యామిని శ్వేత కు గుర్తింపు తెచ్చిపెట్టింది.

అయితే ఈ యామిని శ్వేతా మరెవరో కాదు సీరియల్ ఆర్టిస్ట్ విజయలక్ష్మి కూతురే.ఈమె చైల్డ్ ఆర్టిస్ట్ గా మాత్రమే స్క్రీన్ పై కనిపించాలని తల్లిదండ్రులు భావించారు.

దాంతో ఆమె చిన్నతనంలోనే పలు సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.ఆ తర్వాత పెద్దయ్యాక మాత్రం హీరోయిన్ కాలేకపోయింది.

అయితే జయం సినిమా కంటే ముందు దాదాపుగా పది సీరియల్స్ లో నటించింది యామిని శ్వేత.

మొదట సీతామాలక్ష్మి సీరియల్ చేస్తున్న సమయంలో జయం సినిమా ఆడిషన్స్ కోసం ప్రకటన రాగా, అది చూసిన ఆమె తండ్రి తన ఫోటోలు డైరెక్టర్ కి పంపడంతో అలా హీరోయిన్ చెల్లెలుగా నటించే అవకాశం దక్కింది.ఆ తర్వాత ఉత్సాహం, అనగనగా ఒక కుర్రాడు వంటి సినిమాలు చేసిన తర్వాత పూర్తిగా చదువు పైన దృష్టి పెట్టింది.ఆ తర్వాత సినిమాల్లో కనిపించడం మానేసింది.

జయం సినిమా కంటే ముందు పది సీరియల్స్ లో అలాగే జయం సినిమా తర్వాత పలు సినిమాలలో నటించినప్పటికీ ఆమెకు అంతగా గుర్తింపు తెచ్చి పెట్టలేక పోయాయి.

జయం సినిమాలో హీరోయిన్ సదా పాత్ర తో పాటు చెల్లెలి పాత్రలు కూడా ప్రజలు అమితంగా ప్రేమించారు.ఈ సినిమాలో ఆమె నటనకు గాను నంది అవార్డు కూడా అందుకుంది.ఇకపోతే ఈ సినిమా వచ్చి నేటికి 20 ఏళ్లు పూర్తి అయ్యింది.

మరి ప్రస్తుతం యామిని శ్వేత ఎక్కడ ఉంది? ఏం చేస్తోంది? అన్న విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.సినిమాలకు బైబై చెప్పిన తర్వాత విదేశాల్లో మాస్టర్స్ చేసి అక్కడే ఉద్యోగం చేస్తూ సెటిల్ అయింది.

ఆ తర్వాత పెళ్లిచేసుకుని లైఫ్లో స్థిరపడింది.ప్రస్తుతం ఆమెకు ఒక కూతురు కూడా ఉంది.

ఇకపోతే యామిని శ్వేత చదువుకుంటున్న సమయంలో బోలెడన్ని ఆఫర్లు వచ్చినా కూడా వాటిని సున్నితంగా తిరస్కరించిందట.అందులో నచ్చావులే సినిమా కూడా ఒకటి.ఇక ఆమెకు నంది అవార్డుకు వచ్చిన రెమ్యూనరేషన్ సైతం మానసిక వికలాంగుల ఆశ్రమానికి దానం చేసి తన గొప్ప మనసును చాటుకుంది యామిని శ్వేత. ఇకపోతే యామిని శ్వేత సినిమాలకు దూరంగా ఉంటున్న అప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం తెగ యాక్టివ్ గా ఉంటుంది.

సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ తన అభిమానులకు చేరువగా ఉంటుంది యామిని శ్వేత.ఇక ఆమె మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది అని అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube