నువ్వు లేకపోతే చచ్చిపోతా అని చెప్పి చిత్రవధ చేశాడు.. జయలలిత షాకింగ్ కామెంట్స్!

టాలీవుడ్ ప్రముఖ నటీమణులలో జయలలిత( Jayalalita ) ఒకరు కాగా ఆమె ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బాగానే పాపులర్ అయిన జయలలిత ప్రస్తుతం పరిమితంగా సినిమాలలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

 Jayalalita Shocking Comments Goes Viral In Social Media Details Here , Jayalalit-TeluguStop.com

తన పెళ్లి గురించి, పెళ్లి తర్వాత తనకు ఎదురైన ఇబ్బందుల గురించి ఆమె షాకింగ్ విషయాలను చెప్పుకొచ్చారు.

ఇంద్రుడు చంద్రుడు సినిమా( Indrudu Chandrudu )లో కమల్ నాకు ఛాన్స్ ఇప్పించారని ఆమె అన్నారు.

ఒకరోజుకు మూడు షూట్స్ లో పాల్గొన్నానని ఆమె పేర్కొన్నారు.నా కుటుంబం స్థిరపడింది అనే సమయంలో పెళ్లి చేసుకున్నానని జయలలిత చెప్పుకొచ్చారు.

మలయాళం డైరెక్టర్ తో నేను ప్రేమలో పడ్డానని ఏడేళ్ల ప్రేమ అని ఆమె కామెంట్లు చేశారు.దొంగకోళ్లు పట్టేవాడిలా ఉన్నాడు అతనితో పెళ్లి ఎందుకు అని చాలామంది చెప్పారని జయలలిత చెప్పుకొచ్చారు.

Telugu Jayalalita, Kamal Hasan, Malayalam, Tollywood-Movie

చాలామంది చెప్పి చూసినా నేను వినలేదని ఆమె చెప్పారు.బ్లడ్ తో లెటర్స్ రాయడం, విషం తాగి చనిపోతానని చెప్పడంతో నేను కరిగిపోయి పెళ్లి చేసుకున్నానని ఆమె తెలిపారు.మా కుటుంబానికి పెళ్లి ఇష్టం లేదని ఆ సమయంలో మా పేరెంట్స్ పవర్ ఆఫ్ అటార్నీ నాతో రాయించుకుని మంచి పని చేశారని ఆమె అన్నారు. పిల్లలు పుట్టాక ఇస్తామని మా వాళ్లు చెప్పారని ఆమె తెలిపారు.

Telugu Jayalalita, Kamal Hasan, Malayalam, Tollywood-Movie

నా భర్త మాత్రం పవర్ ఆఫ్ అటార్నీ క్యాన్సిల్ చేయించాలని సూచించాడని జయలలిత అన్నారు. డబ్బు కోసం పెళ్లి చేసుకున్నారని అర్థమైందని జయలలిత పేర్కొన్నారు.ఆ తర్వాత విడిపోయామని ఆమె అన్నారు.చనిపోతామని ఎవరైనా చెబితే కోపం వస్తుందని జయలలిత తెలిపారు.ప్రముఖ నటి జయలలిత వెల్లడించిన విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుండటం గమనార్హం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube