జానర్: ఫ‌్యామిలీ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్నటీనటులు: బెల్లంకొండ శ్రీనివాస్, రకుల్‌ప్రీత్‌సింగ్, ప్రగ్య జైశ్వాల్, కేథరిన్ థెస్రా, జగపతిబాబు, తరుణ్ అరోరా తదితరులుబ్యానర్: ద్వారకా క్రియేషన్స్మ్యూజిక్: దేవిశ్రీ ప్రసాద్నిర్మాతలు: మిర్యాల రవీందర్రెడ్డిదర్శకత్వం: బోయపాటి శ్రీనుసెన్సార్ రిపోర్ట్: యూ/ఏరన్ టైం: 149 నిమిషాలురిలీజ్ డేట్: 11 ఆగస్టు, 2017
టాలీవుడ్ అగ్రనిర్మాత బోయపాటి శ్రీను వారసుడిగా అల్లుడు శీను సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు బెల్లంకొండ శ్రీనివాస్.తొలి సినిమాతో కమర్షియల్ సక్సెస్ కొట్టినా అది కాస్ట్ ఆఫ్ ఫెయిల్యూర్ అయ్యింది.
ఇక రెండో సినిమా స్పీడున్నోడు ప్లాప్ అవ్వడంతో లాంగ్ గ్యాప్ తీసుకుని జయ జానకి నాయక సినిమాతో ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.ఊరమాస్ సినిమాలు తెరకెక్కించడంలో తిరుగులేని డైరెక్టర్‌గా పేరున్న బోయపాటి శ్రీను లెజెండ్, సరైనోడు లాంటి రెండు సూపర్ హిట్లతో ఫామ్‌లో ఉన్నాడు.
మరి బోయపాటి డైరెక్ట్ చేసిన ఈ సినిమా రిలీజ్‌కు ముందే భారీ ప్రి రిలీజ్ బిజినెస్ చేసింది.భారీ అంచనాల మధ్య ఈ రోజు రిలీజ్ అయిన ఈ సినిమా ఎలా ఉందో తెలుగుస్టాప్.కామ్ సమీక్షలో చూద్దాం.
కథ:
ఈ సినిమా కథ ముందుగా కాలేజ్ నేపథ్యంలో సాగుతుంది.హీరోయిన్‌ను ఈవ్‌టీజింగ్ నుంచి హీరో కాపాడతాడు.అక్కడే హీరోయిన్ దగ్గర ఫస్ట్ ఇంప్రెషన్ కొట్టేస్తాడు.రకుల్ ముందుగా హీరోను మోసం చేయాలని చూసినా తర్వాత అతడిని నిజంగానే ఇష్టపడుతుంది.ఇక క్రూరమైన విలన్ జగపతిబాబు తన కూతుర్నే చంపాలని చూస్తుంటాడు.
ఈ టైంలో హీరోయిన్ హీరోకు ప్రపోజ్ చేస్తుంది.అయితే శ్రీను తండ్రి శరత్‌కుమార్ వీరి పెళ్లికి ఒప్పుకోడు.చివరకు రకుల్ రిస్క్‌లో ఉందని తెలుసుకున్న హీరో ఆమెను ఎలా కాపాడాడు ? అసలు రకుల్ ఎందుకు చిక్కుల్లో ఉంది ? వీరి ప్రేమ సక్సెస్ అయ్యిందా ? లేదా ? అన్నదే ఈ సినిమా స్టోరీ.
విశ్లేషణ:
నటనాపరంగా హీరో శ్రీనివాస్ డ్యాన్సులు, ఫైట్లలో మెప్పించినా ఎమోషనల్ సీన్లు, ఎక్స్‌ప్రెషన్లలో మాత్రం తేలిపోయాడు.ఇక రకుల్‌ప్రీత్‌సింగ్ అటు అందంతోను ఇటు అభినయంతోను మెప్పించింది.తన పాత్రకు నూటికి నూరుశాతం న్యాయం చేసింది.ఇక ప్రగ్య జైశ్వాల్ కూడా అందంతో అలరించగా, శరత్‌కుమార్, జగపతిబాబు తమ పాత్రకుల తగ్గట్టుగా న్యాయం చేశారు.
ఇక సినిమాలో ప్రతి ప్రేములోను టాప్ నటీనటులు ఉండడంతో సినిమా ప్రతి సన్నివేశం వాళ్లకోసం అయినా చూడాలనిపించేలా ఉంది.
ఇక సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉంటుంది.సినిమాటోగ్రఫీ, దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ సినిమాకు బాగా హెల్ఫ్ అయ్యాయి.
ఎడిటింగ్ ఓకే.నిర్మాణ విలువలు సినిమాను ఎక్కడికో తీసుకెళ్లాయి.
ఇక బోయపాటి విషయానికి వస్తే సినిమా కథ, కథనాలు రొటీన్‌గానే ఉన్నా బోయపాటి మార్క్ మాత్రం స్పష్టంగా కనపడింది.సినిమా అంతా మాస్ మెచ్చే సన్నివేశాలు, యాక్షన్ సీన్లు బాగా ఎలివేట్ అయ్యాయి.
ఫైట్లు అదిరిపోయాయి.అయితే బెల్లంకొండ మాస్ యాక్షన్‌ను ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారన్నది ఒక్కటే చూడాలి.
ప్లస్ పాయింట్స్ (+):
– బోయపాటి శ్రీను డైరక్షన్– బెల్లంకొండ శ్రీను డ్యాన్స్ అండ్ ఫైట్స్– రకుల్ ప్రీత్ సింగ్r/>– యాక్షన్ సీన్లు– భారీ కాస్టింగ్– నిర్మాణ విలువలు– టెక్నికల్ డిపార్ట్‌మెంట్స్
మైనస్ పాయింట్స్(-):
– హీరో ఎక్స్‌ప్రెషన్స్– ఉహాజనితమైన కథ
ఫైనల్ పంచ్:
బోయపాటి మార్క్ మాస్ మసాలా జయ జానకి నాయకా