దక్షిణాది సినీ ఇండస్ట్రీలో అగ్రతారగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి నయనతార ( Nayanatara ) ) ఇప్పటివరకు బాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రం నటించలేదు అయితే మొదటిసారి ఈమె నటుడు షారుఖ్ ఖాన్ (షారుఖ్ ఖాన్) నటించినటువంటి జవాన్ సినిమా( Jawan Movie ) ద్వారా బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు.సెప్టెంబర్ 7వ తేదీ విడుదలైనటువంటి ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సంచలనమైనటువంటి రికార్డ్స్ సృష్టిస్తుంది.
ఇలా ఈ సినిమా ఎంతో మంచి విజయాన్ని అందుకోవడంతో అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలా ఉండగా ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో నయనతార తన భర్త విగ్నేష్( Vignesh Shivan ) తో కలిసి ముంబైలోని ఓ థియేటర్‌లో ఈ సినిమాని వీక్షించారు.ఈ సినిమా చూసిన అనంతరం ఈమె థియేటర్ బయటకు రావడంతో పెద్ద ఎత్తున అభిమానులు సందడి చేశారు.అదేవిధంగా మీడియా కూడా నయనతారను పలకరించింది.
ఈ క్రమంలోనే మీడియా నయనతారను ప్రశ్నిస్తూ బాలీవుడ్ ఇండస్ట్రీ( Bollywood Industry )లోకి అడుగుపెట్టడానికి హీరోయిన్ గా మీకు ఇంత సమయం ఎందుకు పట్టింది అంటూ ప్రశ్నించారు.అయితే ఈ ప్రశ్నకు నయనతార సమాధానం చెబుతూ .దేనికైనా సరైన సమయం రావాలి.తాను బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టడానికి కాస్త ఆలస్యమైనప్పటికీ తన ఫేవరెట్ హీరో షారుఖ్ ఖాన్( Hero Shah Rukh Khan ) తో కలిసిన నటించే అవకాశం రావడం ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు.
ఇకపై దక్షిణాది సినిమాలతో పాటు బాలీవుడ్ చిత్రాలకు కూడా ప్రాధాన్యత ఇస్తానని ఈమె తెలియజేశారు.ఇక నయనతార నటించిన జవాన్ సినిమా మంచి సక్సెస్ కావడంతో ఇకపై బాలీవుడ్ చిత్రాలలో కూడా నటించడానికి నయనతార ఆసక్తి చూపుతున్నారని ఈ సందర్భంగా చెప్పకనే చెప్పేశారు.ఇక జవాన్ సినిమాకు కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ( Director Atlee ) దర్శకత్వం వహించగా ఈ చిత్రాన్ని షారుఖ్ ఖాన్ తన సొంత బ్యానర్ లోనే నిర్మించారు.ఇక ఈ సినిమాలో తమిళ నటుడు విజయ్ సేతుపతి షారుఖ్ ఖాన్ తో పోటీ పడుతూ అద్భుతంగా విలన్ పాత్రలో నటించి సందడి చేశారు.