అడవి( Forest )లో మాంసాహార జంతువులు ఆహారం కోసం ఇతర జంతువులను తరచుగా వేటాడతాయి.ఇది ప్రకృతి ధర్మం.
అయితే క్రూర జంతువులు సాధు జీవులను వేటాడుతున్న దృశ్యాలు చూస్తే మనసు కలిచి వేస్తుంది.ఇలాంటి వీడియోలు యూట్యూబ్‌లో ఎక్కువగా వైరల్ అవుతుంటాయి.
ఇటీవల ఇలాంటి హార్ట్ బ్రేకింగ్ వీడియో మరొకటి వైరల్ గా మారింది.అన్నీటిలో లాగా కాకుండా ఈ వీడియో చివరిలో ఒక ట్విస్ట్ వచ్చింది, అది చాలామందికి సంతోషాన్ని కలిగించింది.
ఈ వీడియోలో ఒక జింక ప్రాణాలను దక్కించుకోవడానికి అడవి కుక్కతో పోరాడుతున్నట్లు కనిపించింది.ఈ ఘటనను చిత్రీకరించిన పర్యాటకులు.
జింక( Deer ) ధైర్యంగా పోరాడి కుక్కను నీటిలో ముంచివేసి ప్రాణాలను రక్షించుకోగలిగిందని తెలిపారు.

వీడియోలో ఒక కుక్క జింకపై నీటి కొలను సమీపంలో దాడి చేసినట్లు కనిపిస్తుంది.జింక నీటి కొలనులో పడి ఈత కొట్టడానికి ప్రయత్నిస్తుంది, కానీ కుక్క దాని కాలు పట్టుకుని వెనక్కి లాగుతుంది.ఆ తర్వాత కుక్క( Dog ) జింక గొంతును పట్టుకుని బలంగా కొరికేస్తుంది.
జింక తనను తాను విడిపించుకోవడానికి చాలా కష్టపడుతుంది, కానీ కుక్క గట్టిగా పట్టుకుంది.చివరికి, జింక నీటి కొలను మధ్యలోకి వెళుతుంది.దాన్ని ఛేజ్ చేసుకుంటూ వెళ్లిన కుక్క నీటిలో మునిగిపోతుంది, దాంతో జింక సురక్షితంగా దాన్నుంచి తప్పించుకొని దూరంగా ఈదుతుంది.అనంతరం ఆ కుక్క వెనక్కి తిరిగి వచ్చేస్తుంది.
చివరికి జింక వేరే వైపు పరుగులు తీసుకుంటూ ప్రాణాలను రక్షించుకుంటుంది.

ఈ వీడియోను లక్షలాది మంది వీక్షించారు.సోషల్ మీడియాలో బాగా షేర్ అయింది.చాలా మంది జింక ధైర్యం, కుక్క దురదృష్టం గురించి వ్యాఖ్యానించారు.
అడవి కుక్కలు తరచూ గుంపులుగా ప్రయాణిస్తున్నాయని, కుక్కల గుంపు జింకపై దాడి చేసి ఉంటే, అది చనిపోయి ఉండేదని కొందరు వ్యక్తులు కామెంట్లు చేశారు.ఈ సంఘటన అడవిలో వన్యప్రాణులు ఎదుర్కొనే ప్రమాదాలను గుర్తుచేస్తుంది.
ఇది జింక శక్తి, సంకల్పానికి కూడా నిదర్శనం.ఆపదలో కూడా బతుకుపై ఆశలు చిగురిస్తాయని ఈ జింక కథ గుర్తు చేస్తుంది.







