తెలంగాణ రాష్ట్రంలో ఈ మధ్య కాలంలో తరచుగా జరుగుతున్న అగ్ని ప్రమాదాలు కలకలం రేపుతున్నాయి.ఒక వైపు రోడ్దు ప్రమాదాలు కూడా చాలా ఎక్కువగానే నమోదు అవుతుండగా, కరోనా కూడా కలవర పెడుతుంది.
ఇదిలా ఉండగా జనగామ జిల్లాలో షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.ఆ వివరాలు చూస్తే.జనగామ జిల్లా కేంద్రంలోని నెహ్రూ పార్క్ సమీపంలో ఉన్న ఎన్ఎఫ్‌సీ హోటల్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ అయ్యిందట.దీంతో హోటల్‌లో మంటలు భారీగా ఎగిసిపడుతున్నట్లుగా సమాచారం.
ఇక ఈ ప్రమాదంలో హోటల్‌లోని పరికరాలన్నీ కాలి బూడిద అయ్యాయని తెలుస్తుంది.కాగా ఈ అగ్నిప్రమాద ఘటన పై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకురావడంతో పెను ప్రమాదం తప్పినట్లుగా తెలుస్తుంది.
ఇకపోతే హోటల్‌లో అకస్మాత్తుగా షార్ట్ సర్క్యూట్ జరగడానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ మల్లేశ్ యాదవ్ ఈ సందర్భంగా తెలిపారు.