టాలీవుడ్( Tollywood ) ఇండస్ట్రీలో ఒకానొక సమయంలో స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి జగపతి బాబు( Jagapathi Babu ) ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ మాత్రం వరుసగా సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు.అయితే ఈసారి హీరోగా కాకుండా విలన్ పాత్రలలోను సపోర్టింగ్ పాత్రలలో నటిస్తూ ప్రేక్షకులను పెద్ద ఎత్తున సందడి చేస్తున్నారు.
ఇలా నటుడిగా కెరియర్ పరంగా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉన్నటువంటి జగపతిబాబు సోషల్ మీడియాలో ఈ మధ్యకాలంలో చాలా యాక్టివ్ అయ్యారు.ఈ క్రమంలోనే తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు.
ఇంట్లో వంట చేస్తున్నటువంటి ఫోటోలను అలాగే ఇంటిని శుభ్రం చేస్తున్నటువంటి ఫోటోలను కూడా ఈయన షేర్ చేసేవారు.అయితే గత కొద్ది రోజుల క్రితం ఒక పింక్ కలర్ డ్రెస్ ( Pink color dress )ధరించి చాలా స్టైలిష్ లోకి కనిపించారు.ఇందుకు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ ఒకప్పుడు ఇలాంటి దుస్తులు వేసుకుంటే తేడాగాడు అనేవారు ఇప్పుడు అవే దుస్తులు వేసుకుంటే సూపర్ అంటున్నారు.ఏంటో అర్థం కాని లోకం అంటూ చెప్పుకొచ్చారు.
అయితే ఈ ఫోటో పై చాలా మంది మీరు చూడటానికి కుర్రాడిలా ఉన్నారు అంటూ కామెంట్ చేశారు.
ఈ క్రమంలోనే తాజాగా జగపతిబాబు ఒక ఫోటోని షేర్ చేశారు మొహానికి మేకప్ వేసుకున్నటువంటి ఫోటోతో పాటు టిష్యూ పేపర్ కూడా అలాగే ఉన్నటువంటి ఫోటోని షేర్ చేశారు.ఈ ఫోటోని షేర్ చేసినటువంటి ఈయన మొన్న నేను ఒక ఫోటో షేర్ చేయడంతో కుర్రాడిలాగే ఉన్నారని చెప్పారు.దీంతో యేచ్చులు ఎక్కువ అయ్యాయి.
అందుకే నిజంగానే కుర్రాడిలా మారిపోదామని నేను ఇలా తయారయ్యాను అంటూ ఈయన చెప్పుకొచ్చారు.దీంతో ఈ పోస్ట్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో మీరు ఎప్పటికీ ,ఎలా ఉన్న హ్యాండ్సమ్ సార్ అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.