నేడు ఉప్పల్ స్టేడియం వేదికగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ( Hyderabad Cricket Association ) ఎన్నికల పోలింగ్ ముగిసింది.ఉదయం నుండి మధ్యాహ్నం మూడు గంటల వరకు హారాహోరీగా పోలింగ్ జరిగింది.
ఈ ఎన్నికలలో మాజీ క్రికెటర్లు వెంకటపతి రాజు, వీవీఎస్ లక్ష్మణ్, శివలాల్ యాదవ్, మిథాలీ రాజ్, స్రవంతి నాయుడు, జిహెచ్ఎంసి కమిషనర్ రోనాల్డ్ రాజ్( GHMC Commissioner Ronald Rose ) తో సహా మొత్తం 173 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.పోలింగ్ ముగియడంతో అధికారులు హెచ్సీఏ ఎన్నికల ఫలితాలు సాయంత్రం ప్రకటించడం జరిగింది.
ఈ క్రమంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా జగన్ మోహన్ రావు ఎన్నికయ్యారు.
ఉత్కంఠ భరితంగా జరిగిన కౌంటింగ్ లో ఒక్క ఓటు తేడాతో విజయం సాధించారు.జగన్ మోహన్ రావు( Jagan Mohan Rao ) యునైటెడ్ మెంబర్స్ ఆఫ్ హెచ్సీఏ నుంచి పోటీ చేయడం జరిగింది.పరిస్థితి ఇలా ఉంటే రీకౌంటింగ్ జరపాలంటూ ప్రత్యర్థి అర్షద్ ఆయూబ్ ప్యానల్ తరఫున పోటీ చేసిన అమర్నాథ్ డిమాండ్ చేస్తున్నారు.
ఉత్కంఠ భరితంగా సాగిన హెచ్సీఏ ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలను తలపించాయి.ఈ ఎన్నికలలో పోటీ చేసిన ప్యానెల్ లకు బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు మద్దతు తెలిపాయి.ఈ క్రమంలో యునైటెడ్ మెంబర్స్ ఆఫ్ హెచ్సీఏకి అధికార పార్టీ బీఆర్ఎస్.మద్దతు తెలపగా ఇప్పుడు ఆ ప్యానల్ అభ్యర్థి జగన్ మోహన్ రావు విజయం సాధించడం సంచలనంగా మారింది.